టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి భార్య శ్రీమతి వరలక్ష్మి గారు కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో వరలక్ష్మి బుధవారం రాత్రి మరణించారు. గత కొన్ని రోజులుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆమె చికిత్స తీసుకుంటున్నారు. అయితే నిన్న పరిస్థితి విషమించడంతో 62 ఏళ్ల వయస్సులో తుదిశ్వాస విడిచారు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వరలక్ష్మి గారిది చాలా పలుకుబడి కలిగిన కుటుంబం. ఆమె ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమార్తె. దివంగత సీనియర్ నిర్మాత ఎంఎస్.రెడ్డి కుమారుడైన శ్యామ్ ప్రసాద్ రెడ్డితో ఆమె వివాహం జరిగింది. ఇక ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు కాగా, ఆమె కన్నుమూయాయడంతో వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఈ నేపథ్యంలో వరలక్ష్మి గారి అంత్యక్రియలు నేడు నిర్వహించనున్నారు కుటుంబసభ్యులు.
శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. తలంబ్రాలు, ఆహుతి, అంకుశం, అమ్మోరు, అంజి, అరుంధతి.. వంటి ఎన్నో సూపర్ హాట్ సినిమాలు ఆయన ప్రొడ్యూస్ చేసినవే. గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన, ప్రస్తుతం తమ హోం బ్యానర్ మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై జబర్దస్త్, ఢీ లాంటి పలు సూపర్ హిట్ టీవీ షోలు నిర్మిస్తున్నారు.
ఇక వరలక్ష్మి గారి మృతి చెందిన విషయం తెలియడంతో పలువురు టీవీ, సినీ ప్రముఖులు ఆమెకి నివాళులర్పిస్తూ శ్యామ్ ప్రసాద్ రెడ్డిని పరామర్శిస్తున్నారు. మా తెలుగు ఫిల్మ్ నగర్ తరపున వరలక్ష్మి గారి మృతికి తీవ్ర సంతాపం తెలియజేస్తున్నాం. అలాగే ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, అదేవిధంగా ఈ కష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులు మనోధైర్యాన్ని పొందాలని కోరుకుంటున్నాం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: