కేజీఎఫ్ సిరీస్ సినిమాలతో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు కన్నడ స్టార్ హీరో యష్. అయితే ‘కేజీఎఫ్ – చాప్టర్ 2’ వచ్చి రెండేళ్లు దాటిపోయింది. దీని తర్వాత ఇంతవరకూ ఆయన నుంచి మరో మూవీ రాలేదు. దీంతో యష్ ఫ్యాన్స్ ఆయన తదుపరి సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే యష్ హీరోగా ‘టాక్సిక్’ అనే ఓ కొత్త చిత్రం ప్రారంభం అవుతున్నట్టు గత కొన్ని నెలల క్రితమే కన్ఫర్మ్ అయిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో తాజాగా దీనికి సంబంధించి సాలిడ్ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ బెంగళూరులో నేడు (గురువారం) మొదలవుతోంది. ‘ఎ ఫెయిరీ టెల్ ఫర్ గ్రోన్ అప్స్’ అనేది ఉపశీర్షికగా ఉన్న ఈ సినిమాకు ప్రముఖ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించనున్నారు. కాగా ఈ చిత్రాన్ని KVN ప్రొడక్షన్స్ మరియు మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మాత వెంకట్ కె.నారాయణతో కలిసి యష్ స్వయంగా నిర్మిస్తుండటం విశేషం.
ఇక ఈ సందర్భంగా యష్, నిర్మాత వెంకట్ కె.నారాయణ తమ కుటుంబసభ్యులతో కలిసి కర్ణాటకలోని పలు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను దర్శించారు. అయితే ఏదయినా కొత్త సినిమా మొదలుపెట్టేముందు తన ఇష్టదైవాలను దర్శించుకోవడం ఎప్పటినుంచో యష్ అలవాటు అని తెలుస్తోంది. దీనిలో భాగంగానే శ్రీసదాశివ రుద్ర సూర్య ఆలయం, ధర్మస్థలి శ్రీమంజునాథేశ్వర ఆలయం, సుబ్రమణ్యలోని కుక్కే సుబ్రమణ్య ఆలయాలను సందర్శించారు.
అయితే ఇదేరోజున కొత్త సినిమా షూటింగ్ ప్రారంభించడంపై యష్ అభిమానులు ఇలా తెలియజేస్తున్నారు. హీరో యష్ లక్కీ నంబర్ 8 అని, అందుకే ఈరోజు (2024, ఆగస్టు 8) 8-8-8 అనే నంబర్ కలిసి వచ్చే రోజున తన కొత్త సినిమాను మొదలుపెట్టాడని సమాచారం. కేజీఎఫ్ సిరీస్ తరవాత యష్ నుంచి వస్తోన్న చిత్రం కావడంతో ఈ టాక్సిక్ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: