శాంతినివాసం సీరియల్ నుంచి ఆస్కార్ గెలుపు వరకు దర్శకధీరుడు రాజమౌళి అద్భుత సినీ ప్రయాణం చేస్తున్నారు. ఇక ఆయన కెరీర్ లోని ముఖ్య ఘట్టాలకు అద్దం పట్టేలా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ మోడరన్ మాస్టర్స్ డాక్యుమెంటరీ రూపొందించిన సంగతి తెలిసిందే కదా. ఈ నెల 2వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న మోడరన్ మాస్టర్స్ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తోంది. కెరీర్ ప్రారంభంలో ఒక ప్యాషనేట్ యంగ్ డైరెక్టర్ గా, ఆ తర్వాత లార్జర్ దేన్ లైఫ్ మూవీస్ తెరపైకి తీసుకొచ్చిన బిగ్ డైరెక్టర్ గా, ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ గెలిచి అంతర్జాతీయంగా ఫేమ్ తెచ్చుకున్న మోస్ట్ సెలబ్రేటెడ్ ఇండియన్ డైరెక్టర్ గా రాజమౌళి కెరీర్ లోని ప్రతి దశను అందంగా చూపించింది మోడరన్ మాస్టర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అప్లాజ్ ఎంటర్ టైన్ మెంట్, ఫిల్మ్ కంపానియన్ ఈ సిరీస్ ను నిర్మించాయి. రాఘవ్ కన్నా దర్శకత్వం వహించారు. మోడరన్ మాస్టర్స్ లో సినిమా మేకింగ్ పట్ల ఎస్ఎస్ రాజమౌళి ప్రత్యేకత, అంకితభావం గురించి ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, రానా, బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్, హాలీవుడ్ ఫేమస్ ఫిల్మ్ మేకర్స్ రూసో బ్రదర్స్, జేమ్స్ కామోరూన్ చెబుతూ ప్రశంసలు అందజేశారు.
బాహుబలి సిరీస్ తో తెలుగు సినిమా సత్తాను దేశవ్యాప్తంగా తెలియచేశాడు. అలానే ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి తెలియచేశాడు. ఇక రాజమౌళి తన తరువాత సినిమాను మహేష్ తో చేయబోతున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ స్థాయిలో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. కాగా ఈసినిమాను శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కే ఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించబోతున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: