టాలీవుడ్ యంగ్ ట్యాలెంట్ ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కేఎన్ నిర్మాణంలో దర్శకుడు సాయి రాజేశ్ రూపొందించిన కల్ట్ బ్లాక్ బస్టర్ బేబి మరో హిస్టారిక్ ఫీట్ చేసింది. తాజాగా జరిగిన ఫిల్మ్ ఫేర్ సౌత్ 2024 అవార్డ్స్ లో బేబి సినిమాకు 5 అవార్డ్స్ దక్కాయి. మొత్తం 8 నామినేషన్స్ కు గానూ 5 అవార్డ్స్ గెల్చుకుని చరిత్ర సృష్టించింది బేబి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో బేబి మూవీ టీమ్ మీడియాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ఎస్‌కేఎన్, స్టార్ డైరెక్టర్ మారుతి, చిత్ర దర్శకుడు సాయి రాజేశ్ సహా అవార్డ్స్ గెలుచుకున్న లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్, సింగర్ శ్రీరామచంద్ర, సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్, హీరోయిన్ వైష్ణవి చైతన్య పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. “బేబి సినిమాకు 5 ఫిలింఫేర్ అవార్డ్స్ దక్కడం సంతోషంగా ఉంది. అవార్డ్స్ అంటే పెద్ద సినిమాలకే వస్తాయి, చిన్న చిత్రాలకు రావు అని నిరాశ పడేవారికి ఉత్సాహాన్నిచ్చేలా బేబి మూవీకి ఇన్ని అవార్డ్స్ దక్కడం ఆనందంగా ఉంది. ఈ సినిమాకు మీడియా మిత్రులు బాగా సపోర్ట్ చేశారు. బేబి సినిమా కథ చెప్పినప్పుడు సాయి రాజేశ్ కమర్షియల్ గా బాగా చేస్తాడని అనుకున్నాం. ఈ సినిమా చూశాక ఒక గొప్ప మూవీ చేశాడనిపించింది. ఈ సినిమా చూశాక అప్పటికి వరకు నాలో ఉన్న ఒత్తిడి పోయింది” అని తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “సాయి రాజేశ్ టాలెంట్ హృదయ కాలేయం కంటే ముందే మాకు తెలుసు. ఆయన దగ్గర బేబి లాంటి మంచి కాన్సెప్ట్స్ ఇంకా ఉన్నాయి. అందుకే ఆయనను ఒక డైమండ్ లా పెట్టుకుని ముందుకు వెళ్తున్నాం. సాయి రాజేశ్ లో మంచి మ్యూజిక్ టేస్ట్ ఉంది. అది రేపు బేబి హిందీ రీమేక్ తో దేశమంతా తెలియాలని కోరుకుంటున్నా. విజయ్ బుల్గానిన్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. వైష్ణవి బాగా నటించింది. మా ఎస్ కేఎన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడూ కష్టపడుతూ ఉంటాడు. సినిమా బాగా వస్తుందని చెబుతుంటాడు. శ్రీరామచంద్ర గారికి, అనంత్ శ్రీరామ్ గారికి, మా ధీరజ్ కు కంగ్రాట్స్ చెబుతున్నా” అని అన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: