మంచు విష్ణు హీరోగా వస్తున్న సినిమా కన్నప్ప. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మహాశివుడి పరమ భక్తుడు భక్త కన్నప్ప జీవిత నేపథ్యంలో ఈసినిమాను రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. సినిమా షూటింగ్ ను ఎక్కువభాగం విదేశాల్లోనే పూర్తిచేస్తున్నారు. ఇక ఇటీవలే టీజర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలాఉండగా ఈసినిమా నుండి వరుసగా పోస్టర్లను రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ మూవీలో నటిస్తున్న ఒక్కొక్క పాత్రకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే తమిళ నటుడు శరత్ కుమార్ నాథనాధుడు అనే పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించారు. ఇంకా సినీయర్ నటి మధుబాల పన్నగ అనే చెంచుల దొరసాని పాత్రలో కనిపించబోతున్నట్లు తెలిపారు. ఇప్పుడు తాజాగా మరో పాత్రకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. సినీయర్ నటుడు దేవరాజ్ ముండడు అనే ఎరుకల దొర పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించారు. నీలిపాల కొండ ప్రాంతంలో పుట్టారు. నందివింటి వాగు నీరు తాగి పెరిగారు. నాయకుడు ముండడు, అతని కుమారుడు బెబ్బులి… అన్ని తెగలకు తానే నాయకుడు కావాలని ఆశ పడుతుంటాడు. అంటూ దేవరాజ్ పోస్టర్‌ని విడుదల చేశారు.
కాగా ఈసినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పాటు కాజల్, మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్, ప్రీతి ముకుందన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను అవా ఎంటర్టైన్మెంట్ ఇంకా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై మంచు విష్ణు తండ్రి, సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంయుక్తంగా ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: