కోలీవుడ్ స్టార్ హీరో, చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘తంగలాన్’. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. పశుపతి, డేనియల్ కాల్టాగిరోన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్నారు. నీలమ్ ప్రొడక్షన్స్‌తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తంగలాన్ సినిమా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న వరల్డ్ వైడ్‍గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది. తెలుగులో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ అందిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా తంగలాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ సహా టాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. హీరోయిన్ పాయల్ రాజ్ పుత్, ‘బేబి’ ఫేమ్ డైరెక్టర్ సాయి రాజేశ్, సీనియర్ ప్రొడ్యూసర్ దామోదర ప్రసాద్, దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ‘బేబి’ ఫేమ్ డైరెక్టర్ సాయి రాజేశ్ మాట్లాడుతూ.. “తంగలాన్ సినిమా కొంత ఫుటేజ్ చూపించారు నిర్మాత జ్ఞానవేల్ గారు. ఆ ఫుటేజ్ చూశాక అద్భుతం అనిపించింది. ఇదెంత అరుదైన చిత్రమో ఆ ఫుటేజ్‍తో తెలిసింది. నిజంగా ఈ టీమ్ అంతా గొప్ప ప్రయత్నం చేశారు. ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే సినిమా ఇది. దర్శకుడు పా రంజిత్ గారికి, విక్రమ్ గారికి, జ్ఞానవేల్ గారికి ఇతర టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. తంగలాన్ పెద్ద విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా” అని అన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: