మ్యాడ్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు నార్నే నితిన్. ఈసినిమా మంచి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. అంజి కే దర్శకుడిగా పరిచయం అవుతూ నార్నే నితిన్ హీరోగా నయన్ సారిక హీరోయిన్ గా వస్తున్న సినిమా ఆయ్. టైటిల్ తోనే సినిమాపై ఆసక్తిని పెంచారు చిత్రయూనిట్. ఆగష్ట్ 15వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్లు, పాటలు, టీజర్ అన్నీ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా ట్రైలర్ ను ఆగష్ట్ 5వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే అప్ డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక చెప్పినట్టే తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ అయితే ఆద్యంతం హిలేరియస్ గా ఉండి ఆకట్టుకుంటుంది. గోదావరి నేపథ్యంలో సాగే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రానుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. నార్నే నితిన్ తన ఫ్రెండ్స్ తో కలిసి తమ ఊరిలో ఎలాంటి పని లేకుండా ఆకతాయిగా తిరుగుతుంటారు.ఈ క్రమంలో ఆఊరికి వచ్చిన హీరోయిన్ తో హీరో ప్రేమలో పడటంతో వారి జీవితంలో ఎలాంటి మలుపులు తిరుగుతాయి అనేది ఈ సినిమాలో కథగా మనకు చూపించబోతున్నట్లు ట్రైలర్ లో రివీల్ చేశారు. మరి ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలను పెంచేసింది.. సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.
కాగా గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో లవ్ స్టోరీగా వస్తున్న ఈసినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్న ఈసినిమాకు రామ్ మిరియాల సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: