టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని, డైనమిక్ పూరి జగన్నాధ్ డెడ్లీ కాంబినేషన్‍లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’. గతంలో వీరి కాంబోలోనే వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకు సీక్వెల్ గా రూపొందుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఇక తాజాగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ అవ్వడంతో మెంటల్ మాస్ మ్యాడ్‌నెస్ థ్రిల్లింగ్ డోస్ నెక్స్ట్ లెవల్‌కి చేరుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ రీసెంట్‍గా వైజాగ్‍లో నిర్వహించారు. చిత్ర యూనిట్ అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా హీరో రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ గురించి పలు విషయాలు పంచుకున్నారు. రామ్ ఏమన్నారో ఆయన మాటలోనే.. “హాయ్ విశాఖపట్నం. 2018లో పూరి గారిని గోవాలో కలిశాను. ఎలాంటి సినిమా చేద్దామని అనుకున్నప్పుడు పదేళ్ళ తర్వాత గుర్తుండిపోయే క్యారెక్టర్ చేద్దామని అన్నాను. అప్పుడు ఆయన ఇస్మార్ట్ శంకర్ రాశారు.”
“ఇస్మార్ట్ శంకర్ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే మెంటల్ మాస్ మ్యాడ్ నెస్ వాడు. యాక్ట్ చేస్తున్నపుడు నాకు వచ్చిన కిక్ వేరు. అలాంటి మెంటల్ మాస్ మ్యాడ్ నెస్ క్యారెక్టర్ తో ఒక కిక్-యాస్ స్క్రిప్ట్ వుంటే ఎలా ఉంటుందని అనుకున్నాం. అప్పుడు ఈ డబుల్ ఇస్మార్ట్ స్క్రిప్ట్ రాశారు. ఇప్పటివరకూ ఆయన చేసిన సినిమాల్లో అన్నిటికంటే ఎక్కువ టైం తీసుకొని చేశారు. చాలా కష్టపడ్డారు. ఆయనతో పని చేసినప్పుడు ఎంత కిక్ వుంటుందో.. స్క్రిప్ట్ విన్నప్పుడు కూడా అంతే కిక్ వుంటుంది.”
“కమర్షియల్ సినిమా అంటే గుర్తుకువచ్చేది పూరి జగన్నాధ్ గారే. కమర్షియల్ సినిమా అంటే అంత ఈజీ కాదు. కానీ ఒక్కసారి కమర్షియల్ సినిమా హిట్ అయితే దాంట్లో వచ్చే కిక్ ఇంక దేంట్లో రాదు. కమర్షియల్ సినిమాలో థియేటర్స్ లో చేసుకునేది ఒక సెలబ్రేషన్. అది ఇస్మార్ట్ శంకర్ అప్పుడు చూశాను. మళ్ళీ డబుల్ ఇస్మార్ట్ కి ఆ కిక్ వుంటుందని ఆశిస్తున్నాను. అందరం చాలా ఇష్టపడి చేశాం. అలీ గారు ట్రాక్ చాలా ఎంజాయ్ చేస్తారు.”
“కావ్య స్వీట్ హార్ట్. చాలా మంచి అమ్మాయి. టెంపర్ వంశీ క్యారెక్టర్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక పూరి కనెక్ట్ సీఈఓ విష్ చాలా హార్డ్ వర్క్ చేశారు. తను ఛార్మి గారికి రైట్ హ్యాండ్ లాంటి వాడు. చాలా కష్టపడ్డారు. థాంక్ యూ ఛార్మి గారు. ఫ్యాన్స్ నుంచే ఎనర్జీ వస్తుంది. వైజాగ్ వచ్చిన ప్రతిసరి ఆ ఎనర్జీ తీసుకెళ్లా. ఆగస్ట్ 15న కలుద్దాం. మార్ ముంతా చోడ్ చింతా. థాంక్ యూ అల్” అని హీరో రామ్ పోతినేని అన్నారు.
కాగా డబుల్ ఇస్మార్ట్ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, నటి, నిర్మాత ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో కావ్య థాపర్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. అలీ, షాయాజీ షిండే, గెటప్ శ్రీను ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాను తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: