టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని, డైనమిక్ పూరి జగన్నాధ్ డెడ్లీ కాంబినేషన్‍లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’. గతంలో వీరి కాంబోలోనే వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకు సీక్వెల్ గా రూపొందుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఇక తాజాగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ అవ్వడంతో మెంటల్ మాస్ మ్యాడ్‌నెస్ థ్రిల్లింగ్ డోస్ నెక్స్ట్ లెవల్‌కి చేరుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ రీసెంట్‍గా వైజాగ్‍లో నిర్వహించారు. చిత్ర యూనిట్ అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో భాగంగా మూవీ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఓ స్పెషల్ వీడియో బైట్‌లో కనిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “హాయ్ ఎవ్రీ వన్. ఈ ఫంక్షన్ లో మీతో పాటు నేనూ వుండాలి. కానీ సెన్సార్ కోసం ముంబైలో ఫైనల్ మిక్సింగ్ లో వుండి ఈవెంట్ కి రాలేకపోయాను. వెరీ సారీ” అని తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఈవెంట్‍కి రాలేకపోయినందుకు చాలా బాధపడుతున్నాను. వైజాగ్ లోనే తిరిగేవాడిని. అక్కడ ప్రతి థియేటర్‌లో సినిమాలు చూశాను. ఆ సినిమా పిచ్చి తగ్గక డైరెక్టర్‌ని అయ్యాను (నవ్వుతూ). సినిమా పెద్ద హిట్ అయ్యాక వైజాగ్ వచ్చి పర్సనల్‌గా మీ అందరినీ కలుస్తాను. గల్లీలో తిరిగినవాడిని. నేను తీసిన గల్లీ సినిమా. సీ సెంటర్లో సీటీలు వేస్తూ చూడాల్సిన సినిమా. ట్రైలర్‌ని ఎంజాయ్ చేయండి. లవ్ యు ఆల్” అని అన్నారు.
కాగా డబుల్ ఇస్మార్ట్ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, నటి, నిర్మాత ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో కావ్య థాపర్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. అలీ, షాయాజీ షిండే, గెటప్ శ్రీను ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాను తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: