శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా దసరా. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో వచ్చిన ఈసినిమాలో నాని, కీర్తి సురేష్ నటన ,శ్రీకాంత్ డైరెక్షన్,సంతోష్ నారాయణన్ సంగీతం హైలైట్ గా నిలిచాయి. ఇక కలెక్షన్స్ పరంగా కూాడా ఈసినిమా నానికి కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ అందించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా సైమా అవార్డుల్లో కూడా తన సత్తా చాటుకుంది. క్లీన్ స్వీప్ చేసేసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు అవార్డులను సొంతం చేసుకుంది.
*ధరణి పాత్రలో తన మాస్ నటనతో అదరగొట్టిన నానికి ఉత్తమ నటుడు అవార్డు దక్కింది.
*వెన్నెల పాత్రలో అత్యద్భుతమైన నటనకు గానూ కీర్తి సురేష్ ఉత్తమ నటి అవార్డును అందుకుంది.
*ఈసినిమాతోనే డైరెక్టర్ గా అరంగేట్రం చేసిన శ్రీకాంత్ ఓదెల తన మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఇప్పుడు మొదటి సినిమాతోనే బెస్ట్ డైరెక్టర్ గా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకున్నాడు.
*సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్ సినిమా డైనమిక్ విజువల్స్‌ను అందించడంలో అసాధారణమైన వర్క్ కి గాను అవార్డు అందుకున్నారు.
*అద్భుతమైన సెట్స్, సినిమాకు అవసరమైన ఎన్విరాన్ మెంట్ ఇచ్చినందుకు గాను ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా అవార్డును అందుకున్నారు.
*ఎనర్జిటిక్, ఎంగేజింగ్ ధూమ్ ధామ్ పాటకు కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్‌ను అవార్డ్ అందుకున్నారు.
ఇక ఈ సందర్భంగా అవార్డు అందుకున్న అనంతరం నాని మాట్లాడుతూ.. ‘‘ఒకప్పుడు నాకు చాలా అవార్డులు రావాలనే కోరిక ఉండేది, కానీ ఇప్పుడా ఆ కోరిక తగ్గింది. నాకు అవార్డుల కోసం ఇప్పుడు బలమైన కోరిక లేదు. ఇప్పుడు నా కోరికంతా నా దర్శకులు, టెక్నీషియన్లు, నిర్మాతలు, నా సినిమాల్లో పరిచయమైన కొత్త టాలెంట్‌లు, ఇతర ఆర్టిస్టులు అవార్డులు అందుకోవాలనే. అదే నన్ను చాలా ఉత్తేజపరుస్తుంది అని అన్నారు. ఈ రోజు, శ్రీకాంత్, శౌర్యువ్ అవార్డులు గెలుచుకున్నందుకు నేను స్పెషల్ గా థ్రిల్ అయ్యాను. వారు కోరుకునే చోటికి చేరుకోవడానికి వారి ప్రయాణంలో ఒక చిన్న భాగమే నాకు గొప్ప అవార్డు. వారి తొలి అడుగుకు నేను ఒక చిన్న ఇటుక అయినా అందించినట్లయితే అది నాకు సరిపోతుంది. 2023 సంవత్సరం చాలా ప్రత్యేకమైనది. దసరా, హాయ్ నాన్నా చాలా ప్రత్యేకమైనవి అని తెలిపారు.
ఈసినిమాలో ఇంకా కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రల్లో నటించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: