కమిటీ కుర్రోళ్లు.. ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్‌డేట్

Committee Kurrollu Pre Release Event Venue and Date Fixed

మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ మరియు ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై ప్రొడక్షన్ నెం.1గా రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ య‌దు వంశీ ద‌ర్శ‌కత్వం వహిస్తుండగా.. పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో ఫ్రెండ్ షిప్‌, ల‌వ్ అండ్ ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన టీజ‌ర్‌, లిరిక‌ల్ సాంగ్స్‌, థియేట్రికల్ ట్రైలర్‌కు చాలా మంచి స్పంద‌న రావడంతో మూవీపై మంచి బ‌జ్ క్రియేట్ అయ్యింది. కాగా వచ్చే ఫ్రెండ్ షిప్ డే వీక్ సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 9న కమిటీ కుర్రోళ్ళు విడుద‌లకానున్న విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కమిటీ కుర్రోళ్ళు చిత్రం నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక ఖరారు అయింది. ఈరోజు (ఆగస్టు 5) సాయంత్రం 6 గంటలకు దసపల్లా కన్వెన్షన్‌లో ఈ వేడుక జరగనుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ ప్రకటించింది.

కాగా కమిటీ కుర్రోళ్ళు చిత్రంలో దాదాపు అందరూ కొత్తవారే నటిస్తున్నారు. మొత్తం 11మంది హీరోలు, 4గురు హీరోయిన్స్‌ పరిచయం అవుతుండటం విశేషం. సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాద్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్ట, అక్షయ్ శ్రీనివాస్, రాధ్య, తేజస్వి రావు, టీనా శ్రావ్య, విషిక నటించారు. సాయి కుమార్, గోపరాజు రమణ, బలగం జయరాం, శ్రీ లక్ష్మి, కంచెరపాలెం కిషోర్, కిట్టయ్య, రమణ భార్గవ్, జబర్దస్త్ సత్తిపండు తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించారు.

ఇక ఈ చిత్రానికి రాజు ఎడురోలు సినిమాటోగ్ర‌ఫీ అందించగా, అన్వర్ అలీ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. అనుదీప్ దేవ్ సంగీతం సమకూర్చగా, ప్రొడక్షన్ డిజైనర్‌గా ప్రణయ్ నైని పని చేశారు. విజయ్ మాస్టర్ ఫైట్స్ రూపొందించగా, జె.డి మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. అలాగే వెంకట సుభాష్ చీర్ల, కొండల రావు అడ్డగళ్ల సంభాషణలు రాశారు. నిహారిక కొణిదెల సమర్పణలో తొలిసారిగా వస్తుండటంతో ఈ కమిటీ కుర్రోళ్ళుపై మంచి అంచనాలే ఉన్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.