మిస్టర్ బచ్చన్.. రిలీజ్ డేట్ వచ్చేసింది

Ravi Teja Announces Mr Bachchan Release Date

టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’. ట్యాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా హరీష్ శంకర్, రవితేజ కాంబోలో ఇది హ్యాట్రిక్ మూవీ కావడం విశేషం. ఇంతకుముందు వీరిద్దరూ కలిసి షాక్, మిరపకాయ్ చిత్రాలు చేయగా.. ఇందులో మిరపకాయ్ బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా వస్తోన్న మిస్టర్ బచ్చన్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక మిస్టర్ బచ్చన్ సినిమాలో రవితేజ సరసన భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్‍గా నటిస్తోంది. జగపతి బాబు, సచిన్ ఖేడేకర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఇటీవలే రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ ‘సితార్‌’ పాట క్లాసికల్, లవ్లీ కంపోజిషన్, బ్యూటీఫుల్ లోకేషన్స్, రవితేజ, భాగ్యశ్రీ బోర్స్ మధ్య స్టీమీ రొమాన్స్ తో విశేషంగా అలరించి చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది.

ఇక ఈ సినిమా ప్రేక్షకులకు అల్టిమేట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించడానికి రెడీగా ఉంది. ఈ నేపథ్యంలో మిస్టర్ బచ్చన్ నుంచి సాలిడ్ అప్‌డేట్ వచ్చింది. ఈ మేరకు మేకర్స్ తాజాగా రిలీజ్ డేట్ ప్రకటించేశారు. ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే రోజున ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానున్నట్టు తెలిపారు. హీరో రవితేజ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా రవితేజ స్లిక్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తున్న రిలీజ్ డేట్ పోస్టర్‌ అదిరిపోయింది.

ఆగస్ట్ 19న (సోమవారం) రక్షా బంధన్ హాలీడేతో 5 రోజుల లాంగ్ వీకెండ్‌ను ఉపయోగించుకుంటుంది. కాగా ఈ సినిమా ప్రీమియర్ షోలు ఆగస్ట్ 14న జరగనున్నాయి. ఇక సుబ్రమణ్యం ఫర్ సేల్, గద్దలకొండ గణేష్ తర్వాత మిక్కీ జె మేయర్ మిస్టర్ బచ్చన్ కోసం హరీష్ శంకర్‌తో మళ్లీ జతకట్టారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్ గ్రాండ్ నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. అయాంక బోస్ సినిమాటోగ్రఫీ, బ్రహ్మకడలి ఆర్ట్ డైరెక్టర్, ఉజ్వల్ కులకర్ణి ఎడిటర్.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.