ఎప్పటినుండో మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న సుధీర్ బాబుకు హరోంహర అనే సినిమాతో డీసెంట్ హిట్ దక్కింది. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా కుప్పం నేపథ్యంలో ఈసినిమా వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య జూన్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా ఒక ఓటీటీలోకి వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ఓటీటీ హక్కులను ఆహావారు అలానే ఈటీవీ విన్ వారు అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్ వారు సొంతం చేసుకున్నారు. ఇప్పటికే ఈసినిమా ఓటీటీల్లో రిలీజ్ అయి సందడి చేస్తుంది. అంతేకాదు ఓటీటీలో కూడా ఈసినిమా దూసుకుపోతుంది. ప్రైమ్ వీడియోలో ఈ సినిమా టాప్1 లో ట్రెండ్ అవుతోంది. ఈవిషయాన్ని చిత్రయూనిట్ తెలియచేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది.
కాగా ఈసినిమాలో మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా.. సునీల్, రవి కాలే, రాజశేఖర్ అనింగి, కేషల్ దీపక్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుమంత్ జీ నాయుడు నిర్మించగా.. చైతన్ భరద్వాజ్ సంగీతం.. అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫి అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























