టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్సేన్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘మెకానిక్ రాకీ’. #VS10 ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు. రవితేజ ముళ్లపూడి తొలిసారి దర్శకత్వం వహిస్తున్నాడు. ‘గుంటూరు కారం’ ఫేమ్ మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఇప్పటికే లాంఛ్ చేసిన పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ట్రై యాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మరో స్టార్ హీరోయిన్ కూడా నటిస్తోంది. మెకానిక్ రాకీ ఎక్సయిటింగ్ రైడ్‌కు శ్రద్ధా శ్రీనాథ్ ని స్వాగతిస్తూ, మేకర్స్ తాజాగా ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. స్లిట్ మ్యాక్సీ డ్రెస్‌లో శ్రద్ధా శ్రీనాథ్ అల్ట్రా మోడిష్‌గా కనిపిస్తోంది. చర్మిస్మాటిక్ స్మైల్ తో కనిపించిన ఫస్ట్ లుక్ చాలా ఎట్రాక్టివ్ గా వుంది.
హైబడ్జెట్‌తో భారీ కాన్వాస్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పనిచేస్తున్నారు. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. మనోజ్ కటసాని డీవోపీ, అన్వర్ అలీ ఎడిటర్, క్రాంతి ప్రియం ప్రొడక్షన్ డిజైనర్. సత్యం రాజేష్, విద్యాసాగర్ జె ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తున్నారు.
కాగా మెకానిక్ రాకీ దీపావళి రేసులో ఉంటుందని ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్ అక్టోబర్ 31న విడుదల కానుంది. కాగా మెకానిక్ రాకీ ఆలిండియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను ప్రముఖ సంస్థ దక్కించుకున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్, ఏషియన్ సినిమాస్ సంయుక్తంగా ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























