పుష్ప2 ఆగష్ట్ నుండి మళ్లీ మొదలు

producer bunny vas clarity on pushpa 2 movie shooting

సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో అల్లు అర్జున్ -సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న పుష్ప2 సినిమా కూాడా ఒకటి. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమాలో బన్నీ మాస్ లుక్, తన నటన తో పాట కథ, పాటలు అన్నీ సినిమాను బ్లాక్ బస్టర్ చేశాయి. ఇక ఈసినిమా ఇక్కడ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా సంచలనాలు సృష్టించడంతో నార్త్ లో కూడా అల్లు అర్జున్ ప్రత్యేకమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. అందుకే దేశవ్యాప్తంగా ప్రేక్షకులు అందరూ ఈసినిమాకోసం ఎదురుచూస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్టే తెలుస్తుంది. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా షూటింగ్ పై ప్రస్తుతం పలు వార్తలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈ వార్తల్లో భాగంగానే కావాలనే బన్నీ గడ్డం తీసేశాడని.. విదేశాలకు ట్రిప్ కు వెళ్లాడని అన్నారు. అయితే ఈ వార్తలకు క్లారిటీ ఇచ్చాడు నిర్మాత బన్నీ వాసు. బన్నీ వాసు నిర్మాతగా ఆయ్ సినిమా వస్తుంది. ఈనేపథ్యంలోనే ఈసినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా మీడియాతో ముచ్చటించిన ఆయన ఈ రూమర్లపై స్పందిస్తూ ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. ఆగష్ట్ లో మళ్లీ షూటింగ్ మొదలవుతుందని.. బన్నీ షూటింగ్ పోర్షన్ దాదాపు పూర్తయింది.. కేవలం ఇంకా క పదిహేను రోజుల పాటు మాత్రమే ఉంది.. ఫహద్ మరియు బన్నీ షూటింగ్ ల పార్ట్ ఇంకా క్లైమాక్స్, ఒక సాంగ్ పెండింగ్ లో ఉంది అంటూ క్లారిటీ ఇచ్చాడు.

కాగా పుష్ప..ది రూల్ కూడా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. రెండో పార్టులో కూడా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తుంది. జగపతిబాబు, అనసూయ, ఫహాద్ ఫాజిల్ కూడా నటిస్తున్నారు. అలానే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.