హీరో అడివి శేష్ మరోసారి తన గొప్ప మనసును చాటారు. మంచి మనసుతో స్పందించడంలో ఎప్పుడూ ముందుండే శేష్ ఇటీవల క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్ని పాపతో రోజంతా సమయాన్ని గడిపారు. ఇండస్ట్రీకి చెందిన ఒక సన్నిహిత వ్యక్తి ద్వారా ఈ చిన్ని అభిమాని గురించి తెలుసుకున్న శేష్, త్వరగా ఆమె, కుటుంబ సభ్యులని సంప్రదించారు. వీడియో కాల్స్ ద్వారా కనెక్ట్ అయ్యారు. చిన్నారి మెసేజులకు రిప్లేయ్ ఇచ్చారు. చిన్నారి కోసం ఒక క్యూట్ సర్ ప్రైజ్ ప్లాన్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఒక హోటల్‌లో ఫ్యామిలీ కోసం డే అవుట్ ని ప్లాన్ చేసి, అక్కడ చిన్నారిని కలసి సర్ప్రైజ్ చేశారు. పాపతో రోజంతా సరదాగా ఆడుతూ గడిపారు. చిన్నిపాప, ఆమె కుటుంబ సభ్యులతో ఎప్పుడూ సన్నిహితంగా ఉంటున్న శేష్, అవసరమైనప్పుడు తన సపోర్ట్ ఉంటుందని చెప్పారు. కన్సల్టేషన్ కోసం హైదరాబాద్‌కు వచ్చినప్పుడు వారిని మళ్లీ కలుసుకున్నారు. శేష్‌కి డై -హార్డ్ ఫ్యాన్ అయిన ఆ చిన్నారి తన అభిమాన హీరోని కలవాలని చాలా కాలంగా కలలుకంది. ఆమె పరిస్థితి తెలుసుకున్న శేష్, ఆమె కలను నిజం చేయాలని నిర్ణయించుకున్నారు. స్క్రీన్ మీదే కాదు, అఫ్ స్క్రీన్ లోనూ లార్జర్ దెన్ లైఫ్ హీరోగా తన గొప్ప మనసుని చాటారు శేష్.
ప్రస్తుతం అయితే అడివి శేష్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. గూఢచారి 2, డెకాయిట్ సినిమాలు తన లిస్ట్ లో ఉన్నాయి. రెండు సినిమాలు కూడా షూటింగ్ దశలో ఉన్నాయి. క్షణం, గూఢచారి తో సహా పలు తెలుగు బ్లాక్‌బస్టర్‌లకు డివోపీగా పనిచేసిన షానీల్ డియో డెకాయిట్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తుండగా.. సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
మేజర్ ఎడిటర్ వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వంలో గూఢచారి 2 వస్తుంది. ఈసినిమాలో బనితా సంధు హీరోయిన్ గా నటిస్తుంది. ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2, మేజర్ వంటి ఆల్ ఇండియా హిట్ లను అందించిన ప్రముఖ నిర్మాతలు టిజి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ లపై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































