యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ మ్యాడ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన సంగతి తెలిసిందే కదా. ఆ సినిమా సూపర్ హిట్ నే అందించింది. ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. అంజి కంచిపల్లి దర్శకత్వం లో నార్నే నితిన్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో ఆయ్ అనే సినిమా చేస్తున్నాడు. గోదావరి జిల్లాలో ఆయ్ అనేది వాడుక పదం అన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇదే పదాన్ని సినిమా టైటిల్ గా పెట్టడంతోనే సినిమాకు మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది. ఈసినిమా ఆగష్ట్ 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా నుండి వరుసగా పాటలను రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు మేకర్స్. ఇప్పటికే సూఫియానా, రంగనాయకి అనే పాటలను రిలీజ్ చేయగా ఇప్పుడు ఈసినిమా థీమ్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈసాంగా లాంచ్ ఈవెంట్ ను కూడా నిర్వహించారు మేకర్స్. సురేష్ బనిశెట్టి లిరిక్స్ అందించిన ఈపాటను అనంత్ సిద్దార్థ్, మోక్షిత్ ఈపాటను ఆలపించారు.
కాగా గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో లవ్ స్టోరీగా వస్తున్న ఈసినిమాలో నయన్ సారిక హీరోయిన్ గా నటిస్తుంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్న ఈసినిమాకు రామ్ మిరియాల సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























