ఇంట్రెస్టింగ్ గా కిరణ్ అబ్బవరం క మూవీ టీజర్ రిలీజ్

Kiran Abbavaram KA Movie Teaser Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Latest Tollywood Updates,Telugu Film News 2024,Tollywood Movie Updates,KA Teaser,KA Movie Teaser,KA Telugu Movie Teaser,KA Official Teaser,KA Movie Official Teaser,Kiran Abbavaram KA Movie Teaser,Kiran Abbavaram KA Movie,KA,KA Movie,KA Telugu Movie,KA Teaser Review,KA Movie Teaser Review

రాజావారు రాణివారు, ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమాలతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం. అంతేకాదు చాాలా తక్కువ కాలంలోనే వరుస సినిమాలతో బిజీ హీరో కూడా అయిపోయాడు. పెద్ద పెద్ద బ్యానర్ లలో సైతం సినిమా అవకాశాలను దక్కించుకున్నాడు. ఈమధ్య వినరో భాగ్యము విష్ణు కథ సినిమాతో ఒక మోస్తరు హిట్ ను అయితే అందుకున్నాడు తప్పా సాలిడ్ హిట్ ను అయితే అందుకోలేకపోయాడు. ఇప్పుడు కొంత గ్యాప్ తరువాత ఒక సినిమాతో వస్తున్నాడు. సుజీత్-సందీప్ ద్వయం దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈసినిమా రాబోతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా టైటిల్ ను రీసెంట్ గానే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. క అనే ఇంటెస్టింగ్ టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. ఇప్పుడు మరో సర్ ప్రైజింగ్ అప్ డేట్ తో వచ్చారు. ఈసినిమా టీజర్ ను నేడు రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. దీనిలో భాగంగానే ఈసినిమా టీజర్ ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎవ‌రు నువ్వు.. ఎక్క‌డి నుంచి వ‌చ్చావు. పక్కా వాళ్ల ఉత్తరాలు ఎందుకు చ‌దువుతున్నావు.. నీకంటూ ఎవ‌రు లేరా అంటూ మొదలైన టీజర్ లో కిర‌ణ్ అబ్బ‌వ‌రం ఓ పోస్ట్ మెన్ గా క‌నిపిస్తున్నాడు. అయితే లెటర్స్ ను చదివే అలవాటు ఉన్న కిరణ్ అబ్బవరం ఆతరువాత ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు అన్న నేపథ్యంలో ఈసినిమా వస్తున్నట్టు అర్థమవుతుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్ అన్నీ ఆక్టుకుంటున్నాయి. టీజర్ అయితే సినిమాపై అంచనాలు పెంచేసింది.

కాగా శ్రీ చక్ర ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై గోపాలకృష్ణతో కలిపి కిరణ్ అబ్బవరం కూడా నిర్మిస్తున్నాడు. ఈసినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే రిలీజ్ డేట్ కు సంబంధించిన అప్ డేట్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. మరి ఈసినిమాతో అయినా కిరణ్ మంచి హిట్ దక్కుతుందేమో చూద్దాం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.