డార్లింగ్- సన్ చలియా లవ్ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్

sun chaliya song release date from darling movie

అశ్విన్ రామ్ దర్శకత్వంలో ప్రియదర్శి హీరోగా నభా నటేష్ హీరోయిన్ గా వస్తున్న సినిమా డార్లింగ్. చాలా గ్యాప్ తరువాత నభా నటేష్ ఈసినిమాతో రాబోతుంది ఇక ఈసినిమా జులై 19వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఇక ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. రీసెంట్ గానే ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ అయితే సినిమాపై క్యూరియాసిటీనీ పెంచేసింది. అపరిచితురాలిగా ప్రవర్తించే భార్యతో భర్త ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అనే నేపథ్యంలో కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమా నుండి పాటలను కూడా వరుసగా రిలీజ్ చేస్తున్నారు. కనులే అంటూ వచ్చే ఫస్ట్ సింగిల్, రాహీ రే అంటూ వచ్చే సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేశారు. ఇప్పుడు మూడో పాటకు సంబంధించిన అప్ డేట్ తో వచ్చారు. సన్ చలియా అంటూ వచ్చే లవ్ సాంగ్ ను జులై 12వ తేదీన ఈపాటను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.

కాగా ఇంకా ఈ సినిమాలో మురళీధర్ గౌడ్, శివ రెడ్డి, కృష్ణ తేజ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. చైతన్య రెడ్డి సమర్పణలో నిరంజన్ రెడ్డి ప్రైమ్ షో ఎంటర్ టైనమెంట్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.