సెన్సార్ పూర్తిచేసుకున్న రాయన్

dhanush raayan movie completed censor formalities

తమిళ్ టాలెంటెడ్ నటుడు ధనుష్ భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈఏడాది ఇప్పటికే కెప్టెన్ మిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ ను అందుకున్నాడు ధనుష్. ప్రస్తుతం తన లిస్ట్ లో పలు సినిమాలు ఉండగా అందులో రాయన్ సినిమా కూడా ఒకటి. ఈసినిమాకు ధనుషే స్వయంగా దర్శకత్వం వహిస్తున్నాడు. దీంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా జులై 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే కదా. దీంతో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా టీజర్ ను అలానే పాటలను వరుసగా రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక ఇప్పుడు ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు సైతం పూర్తిచేసుకుంది. ఈసినిమాకు ఏ సర్టిఫికెట్ ను అందించారు సెన్సార్ బృందం. సెన్సార్ బృందం నుండి ఈసినిమాకు మంచి ప్రశంసలు దక్కినట్టు తెలుస్తుంది.

కాగా ఈసినిమాలో ఇంకా ఎస్.జే.సూర్య, ప్రకాష్ రాజ్, సెల్వరాఘవన్‌, అపర్ణా బాలమురళి, ధుషార విజయన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమిళ్ టాప్ నిర్మాణ సంస్థ అయిన సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఓం ప్రకాశ్‌ డీవోపీగా అలానే యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌గా పీటర్‌ హెయిన్‌ వ్యవహరిస్తున్నారు. తెలుగు రిలీజ్ హక్కులను ప్రముఖ నిర్మాత అలాగే డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి సురేష్ బాబు అలాగే ఏషియన్ వారు సొంతం చేసుకున్నారు. దీనితో తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమాను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి వారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.