కిరణ్ అబ్బవరం న్యూ మూవీ టైటిల్ రిలీజ్

kiran abbavaram new movie gets interesting title

రాజావారు.. రాణివారు అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు కిరణ్ అబ్బవరం. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును తెచ్చుకొని చాలా తక్కువ టైమ్ లోనే వరుసగా సినిమా అవకాశాలను అందుకున్నాడు. చిన్న నిర్మాణ సంస్థలు కాదు గీతా ఆర్ట్స్, మైత్రీ మూవీ మేకర్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థల్లో సైతం సినిమాలు చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఇక గత ఏడాది రెండు మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరించిన కిరణ్ అబ్బవరం ఈ ఏడాది కాస్త స్లో అయ్యాడు. ఇంతవరకూ తన కొత్త ప్రాజెక్ట్ కు సంబంధించిన అప్ డేట్ రాలేదు. తన నుండి వచ్చిన చివర సినిమా రూల్స్ రంజన్. ఈ సినిమా తరువాత మరే సినిమా రాలేదు. మరోవైపు ఇటీవలే వివాహబంధంలోకి కూడా అడుగుపెట్టడంతో కొంచం గ్యాప్ ఇచ్చాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇప్పుడు కిరణ్ అబ్బవరం నుండి మరో కొత్త సినిమా రాబోతుంది. సుజీత్-సందీప్ ద్వయం దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈసినిమా రాబోతుంది. ఇప్పటికే ఈసినిమాను అధికారికంగా ప్రకటించారు కూడా. అంతేకాదు ఈసినిమా టైటిల్ ను నేడు(జులై9) రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే తాజాగా టైటిల్ రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. ఇక తాజాగా ఈసినిమా టైటిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈసినిమాకు క (కిరణ్ అబ్బవరం) అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. టైటిల్ తోనే సినిమాపై క్యూరియాసిటీని పెంచారు.

కాగా శ్రీ చక్ర ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై గోపాలకృష్ణతో కలిపి కిరణ్ అబ్బవరం కూడా నిర్మిస్తున్నాడు. ఈసినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది. ఈసినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో తెలియచేయనున్నారు. మరి ఈసినిమాతో అయినా కిరణ్ మంచి హిట్ దక్కుతుందేమో చూద్దాం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.