బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్ఫీరా’. జాతీయ అవార్డు గ్రహీత సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. శాలినీ ఉషాదేవి, పూజా తోలానితో కలిసి ఆమె ఈ సినిమాకు స్క్రిప్ట్‌ను కూడా అందించారు. కాగా ఈ చిత్రం కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా 2020లో వచ్చిన బ్లాక్ బస్టర్ ‘సూరారై పోట్రు’కి రీమేక్ కావడం విశేషం. నాడు డైరెక్ట్‌గా ఓటీటీలోకి విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని అందుకుంది. తెలుగులో ఇది ‘ఆకాశమే హద్దురా’ పేరుతో విడుదలైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక సర్ఫీరా చిత్రంలో హీరో సూర్య ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఆయనతో పాటుగా ఈ చిత్రంలో రాధిక మదన్, పరేష్ రావల్, సీమా బిస్వాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సర్ఫీరా జూలై 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ సర్ఫీరా ప్రమోషన్స్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన సర్ఫీరా ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది.
ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ బుధవారం స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటుచేసింది. ఈ కార్యక్రమంలో అక్షయ్ కుమార్ అండ్ టీమ్ పాల్గొంది. వీరితోపాటు రాధికా మదన్, జ్యోతిక, దర్శకురాలు సుధా కొంగర కూడా పొల్గొన్నారు. ఇక సర్ఫీరా స్పెషల్ స్క్రీనింగ్‌కు హీరో సూర్య కూడా హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు స్టార్ హీరోలు ఫోటోలకు ఫోజులిచ్చారు. దీంతో తమ అభిమాన హీరోలను ఇలా ఒకే ఫ్రేమ్‌లో చూసిన ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. కాగా ప్రస్తుతం ఈ విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కాగా సర్ఫీరా చిత్రాన్ని జ్యోతిక మరియు సూర్యల హోం బ్యానర్ 2D ఎంటర్టైన్మెంట్తో కలిసి కేప్ ఆఫ్ గుడ్ ఫిలింస్ సమర్పణలో అరుణా భాటియా మరియు విక్రమ్ మల్హోర్తా యొక్క అబండెన్షియా ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించింది. తనిష్క్ బాగ్ఛీ, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా.. నేషనల్ అవార్డ్ విన్నింగ్ సింగర్ శ్రేయా ఘోషల్, మికా సింగ్, నీతి మోహన్ వంటి ప్రఖ్యాత గాయకులు ఇందులోని పాటలకు తమ గాత్రాన్ని అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: