కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

విక్రమ్ తంగలాన్ ట్రైలర్ రిలీజ్

vikram thangalaan movie trailer out now

విక్రమ్ తంగలాన్ ట్రైలర్ రిలీజ్

Vikram Thangalaan Movie Trailer Out Now

vikram thangalaan movie trailer out now

తమిళ్ లో రాబోతున్నమోస్ట్ అవైటెడ్ సినిమాల్లో విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ నుండి వస్తున్న తంగలాన్ సినిమా ఒకటి. పా రంజిత్ దర్శకత్వంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా వస్తుంది. ఈసినిమాకోసం ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఎప్పటిలాగే ఈసినిమాలో కూడా విక్రమ్ మరో డిఫరెంట్ గెటప్ తో రాబోతున్నాడు. ఈసినిమాకోసం విక్రమ్ తన మేకోవర్ ను పూర్తిగా మార్చేశాడు. అంతేకాదు టీజర్ ను కూడా ఇప్పటికే రిలీజ్ చేయగా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇదిలా ఉండగా ఈసినిమా నుండి చాలా రోజులుగా ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు మేకర్స్. అయితే ఇప్పుడు మళ్లీ ప్రమోషన్స్ ను స్పీడప్ చేశారు. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ కూడా అద్భుతంగా ఉంది. ట్రైలర్ లో యాక్షన్ ఎలిమెంట్స్, విక్రమ్ నటన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్నీ ఆకట్టుకుంటున్నాయి.

కాగా ఈసినిమాలో పార్వతి తిరువొత్తు, డేనియల్ కాల్టాగిరోన్, మాళవిక మోహనన్‌, పశుపతి, హరికృష్ణన్, అన్బుదురై కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీని స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేళ్‌ రాజా నిర్మిస్తున్నారు.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్