ఉప్పెన తో సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది యంగ్ హీరోయిన్ కృతి శెట్టి.ఈసినిమా బ్లాక్ బాస్టర్ కావడంతో ఆఫర్లు క్యూ కట్టాయి.అయితే ఉప్పెన తరువాత ఆ సక్సెస్ స్ట్రీక్ ను కంటిన్యూ చేయలేకపోయింది.తెలుగులో తన చివరి సినిమా మనమే.రీసెంట్ గా వచ్చిన ఈసినిమా డీసెంట్ హిట్ అనిపించుకుంది.ఇక ఈసినిమా తరువాత ప్రస్తుతానికి తెలుగులో అయితే మరో సినిమా ఒప్పుకోలేదు కానీ మలయాళంలో క్రేజీ ఆఫర్ కొట్టేసింది ఈహీరోయిన్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించనున్న కాంత అనే సినిమా కోసం కృతిని హీరోయిన్ గా తీసుకున్నారు.ఈసినిమా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కనుంది.లైఫ్ ఆఫ్ ఫై సినిమాకు ప్రొడక్షన్ అసిస్టెంట్ గా చేసిన సెల్వమణి సెల్వరాజ్ కాంతను డైరెక్ట్ చేయనున్నాడు.ప్రముఖ తెలుగు హీరో రానా ఓ నిర్మాత గా వ్యవహరిస్తున్నాడు.వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో విడుదలచేయనున్నారు.
ఇక దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం తెలుగులో వెంకీ అట్లూరి డైరెక్షన్ లో లక్కీ భాస్కర్ చేస్తున్నాడు.సీతారామం తరువాత హీరోగా తనకిది రెండో తెలుగు సినిమా. సెప్టెంబర్ 7న విడుదలకానుంది.ఇక ఈసినిమా కాకుండా దుల్కర్ మరో సినిమాకు కూడా సైన్ చేశాడని సమాచారం.త్వరలోనే ఆ సినిమా కు సంబంధించిన అనౌన్స్ మెంట్ రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: