టాలీవుడ్ మాస్ కాదాస్ విశ్వక్ సేన్ ఈ యేడాది గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో దూసుకుపోతున్న ఆయన ఇప్పటికే ‘మెకానిక్ రాఖి’ అనే సినిమాను పట్టాలెక్కించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అది సెట్స్‌పై ఉండగా.. తాజాగా మరో వైవిధ్య భరిత సినిమాను లైన్‌లో పెట్టేశాడు. కాగా ఈ చిత్రానికి ‘లైలా’ అనే టైటిల్ ఖరారు చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా బుధవారం ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు లైలా ఫస్ట్ లుక్‌ను రివీల్ చేశారు. దీనిని గమనిస్తే.. ఈ సినిమాలో విశ్వక్ లేడీ గెటప్‌లో కనిపించనున్నట్లు అర్ధమవుతోంది. కళ్ళు మాత్రమే కనపడేలా ఉన్న ఈ పోస్టర్ లో విశ్వక్ నిజమైన అమ్మాయిలా కనిపించి మెస్మరైజ్ చేశాడు. కాగా లేడీ గెటప్‌లో విశ్వక్ కనిపించడం ఇదే మొదటిసారి కావడంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.
త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహూ గారపాటి నిర్మిస్తుండగా, రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆకాంక్ష శర్మ కథానాయికగా నటిస్తోంది. ఇక ఈ సినిమాకు జిబ్రాన్, తనిష్క్ ద్వయం సంగీతం అందిస్తుండటం గమనార్హం. కాగా లైలా చిత్రాన్ని వాలంటైన్స్ డే సందర్భంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: