టాలెంటెడ్ హీరో శర్వానంద్ నుండి రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమా మనమే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో లవ్ ప్లస్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా జూన్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా డీసెంట్ కలెక్షన్స్ నే అందించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా ఓటీటీ రిలీజ్ పై ఒక ఇంట్రెస్టింగ్ బజ్ ఒకటి తెరపైకి వచ్చింది. ఈసినిమా ఓటీటీ హక్కుల ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఆ సంస్థ మరేదో కాదు.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు ఈసినిమా హక్కులను సొంతం చేసుకున్నారట. అంతేకాదు జులై సెకండ్ వీక్ లో ఈసినిమా ఓటీటీ లో రిలీజ్ కానున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వెయిట్ చేయాల్సిందే.
కాగా ఈసినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటించగా.. విక్రమ్ ఆదిత్య, సీరత్ కపూర్, అయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుదర్శన్ కీలక పాత్రల్లో నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించారు.
ఇంకా శర్వా పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో శర్వా 36సినిమా వస్తుంది. ఈసినిమా యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అలానే శర్వా 37 మూవీ సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రానుంది. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకు విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: