కన్నడ స్టార్ హీరో దర్శన్ కలలో కూడా ఎవరికీ హాని తలపెట్టడని పేర్కొన్నాడు టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య. ఈ మేరకు ఆయన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక పోస్ట్ పెట్టాడు. అందులో దర్శన్‌కు మద్దతు ప్రకటించిన శౌర్య కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. కాగా నాగశౌర్య చేసిన ఇన్‌స్టా పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“మరణించిన వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం. ఈ కష్ట సమయంలో వారికి బలం చేకూరాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. దర్శన్ అన్న కలలలో కూడా ఎవరికీ హాని కలిగించే వ్యక్తి కాదు. దర్శన్ గురించి బాగా తెలిసిన వారికి అతని వ్యక్తిత్వం, సేవాగుణం ఎలాంటిదన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. కష్టసమయంలో దర్శన్ ఎంతో మందికి సాయం చేయడమే కాకుండా అండగా నిలబడ్డాడు” అని తెలిపాడు నాగశౌర్య.
ఇంకా ఆయన ఇలా అన్నారు.. “మన న్యాయ వ్యవస్థపై నాకు నమ్మకం ఉంది. త్వరలోనే నిజం బయటకు వస్తుందని నమ్ముతున్నాను. అయితే నిజానిజాలు ఏమిటన్నది వెల్లడి కాకముందే దర్శన్‌పై వస్తోన్న ఆరోపణల్లో చాలా మంది ఓ నిర్ణయానికి రావడం సరైంది కాదు. నిజమైన దోషులు చట్టం ముందుకు తప్పకుండా వస్తారు. దర్శన్ నిర్ధోషిగా బయటపడతాడనే నమ్మకముంది” అని శౌర్య విశ్వాసం వ్యక్తం చేశాడు.
కాగా రేణుకా స్వామి అనే తన అభిమాని మర్డర్ కేసులో ఆరోపణలు రావడంతో హీరో దర్శన్‌ని బెంగళూరు పోలీసులు గత కొన్ని వారాలక్రితం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తన సన్నిహితులతో కలిసి దర్శన్ రేణుకా స్వామిని హత్య చేయించాడని, ఇది పోలీసుల ఇన్వేస్టిగేషన్‌లో బయటపడిందని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాగశౌర్య దర్శన్‌కు మద్దతుగా నిలవడం గమనార్హం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























