పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కల్కి 2898 AD’ భారీ అంచనాల నడుమ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మల్టీలింగ్వెల్ చిత్రం బెనిఫిట్ షోల తోనే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని మ్యాసీవ్ రెస్పాన్స్‌తో గ్లోబల్ వైడ్‌గా సెన్సేషన్ సృష్టిస్తోంది. ఇక ఇలాంటి విజువల్ వండర్ ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకూ రాలేదని మూవీ లవర్స్ చెబుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో ఇండియన్ బాక్సాఫీస్ వద్దే కాకుండా ఓవర్సీస్లో సైతం దుమ్ము రేపుతోంది. ఈ క్రమంలో నార్త్ అమెరికాలో కల్కి చిత్రం రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. రిలీజ్‌కు ముందే కేవలం ప్రీమియర్స్ తోనే 3.5 మిలియన్లకు పైగా కలెక్షన్స్ సాధించి ‘ఆర్ఆర్ఆర్’ రికార్డుని బద్దలు కొట్టి ఔరా అనిపించింది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. కల్కి మూవీ ప్రీమియర్స్ ద్వారా 3,906,423 డాలర్స్ (రూ.32,60,11,117) రాగా.. గురువారం తొలిరోజు షోలతో 1,597,171 డాలర్స్ (రూ.13,32,99,971) వసూళ్లు సాధించింది. తద్వారా మొత్తం 5,503,594+ మిలియన్ డాలర్స్ (రూ.45,93,18,672) కలెక్ట్ చేసింది.
కాగా వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే హీరోయిన్గా నటించగా.. ఇండియన్ లెజెండరీ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్ మరియు కమల్ హాసన్ కీలక పాత్రల్లో కనిపించారు. అలాగే దిశాపటానీ, మాళవిక నాయర్, బెంగాలీ నటుడు స్వాస్థ్ ఛటర్జీ, రాజేంద్రప్రసాద్, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























