మిస్టర్ బచ్చన్- దసరా రిలీజ్ ప్లాన్?

raviteja mr bachchan movie release plan

ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ పై స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాంటి కాంబినేషన్ రవితేజ-హరీష్ శంకర్ కాంబినేషన్. వీరిద్దరి కాంబినేషన్ లో షాక్, మిరపకాయ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. వాటిలో మిరపకాయ సినిమా మాత్రం ఇప్పటికి టీవీల్లో వచ్చినా చూస్తుంటారు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుంది. మిస్టర్ బచ్చన్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఇప్పుడు ఈసినిమా రిలీజ్ పై ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. ఈసినిమాను దసరా పండుగ సందర్భంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దసరా పండుగ ఏమో అక్టోబర్ లో ఉంది. అంటే ఇంకా నాలుగు నెలలు టైమ్ ఉంది. ఎలాగూ ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఈనాలుగు నెలల్లో మిగిలిన పనులు పూర్తి చేయడం పెద్ద కష్టమైన పని కాదు. కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటూ దసరాకు వచ్చేయోచ్చు. అయితే దసరాకు వేరే సినిమాలు కూడా లిస్ట్ లో ఉంటాయి కాబట్టి ఆ దిశగా ఏమైనా ప్లాన్ మార్చుకునే అవకాశం ఉంటుంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

ఇక రీసెంట్ గానే ఈసినిమా నుండి షో రీల్ పేరుతో గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రవితేజ ఇన్‌క‌మ్ టాక్స్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌బోతున్నాడు. కాగా ఈసినిమాలో ఈసినిమాలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా, అయనంక బోస్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఈ చిత్రానికి అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ కాగా, ఎడిటింగ్ ఉజ్వల్ కులకర్ణి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.