కల్కి 2898 AD.. థీమ్‌ సాంగ్ లిరికల్‌ వీడియో రిలీజ్

Kalki 2898 AD Theme Song Lyrical Video Released

పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన మాగ్నమ్ ఓపస్ ‘కల్కి 2898 AD’. బాలీవుడ్ ముద్దుగుమ్మలు దీపికా పదుకొణే, దిశాపటానీ కథానాయికలుగా నటించగా.. ఇండియన్ లెజెండరీ నటులు అమితాబ్‌ బచ్చన్‌ మరియు కమల్‌హాసన్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ, రాజేంద్రప్రసాద్‌, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఇక వైజయంతీ మూవీస్‌ పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్‌ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నెల 27న కల్కి చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ మల్టీలింగ్వెల్, మైథాలజీ-ఇన్స్ స్పైర్డ్ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కి గ్రౌండ్ బ్రేకింగ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఇటీవలే రిలీజ్ చేసిన ‘భైరవ ఆంథమ్’ ఇండియన్స్ బిగ్గెస్ట్ సాంగ్ అఫ్ ది ఇయర్‌గా టాప్ చార్ట్‌లో వుంది. వీటితోపాటుగా ఇటీవలే విడుదల చేసిన రిలీజ్ ట్రైలర్ కూడా మ్యాసీవ్ రెస్పాన్స్‌తో గ్లోబల్ వైడ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

విడుదలకు కేవలం రెండు రోజులే ఉండడంతో ప్రేక్షకులు, సినీవర్గాల్లో అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుండి “థీమ్ ఆఫ్ కల్కి” పేరుతో లిరికల్‌ వీడియోను విడుదల చేశారు. ఈ పాటను ఆస్కార్ అవార్డ్ గ్రహీత చంద్రబోస్‌ రచించగా.. సంతోష్‌ నారాయణ్‌ స్వరపరిచారు. కాలభైరవ మనోహరంగా ఆలపించిన ఈ గేయం శ్రీకృష్ణుడి శక్తియుక్తుల్ని ఆవిష్కరిస్తూ సాగింది. ‘అధర్మాన్ని అణిచేయగా యుగయుగాన జగములోన పరిపరి విధాల్లోన విభవించే విక్రమ విరాట్‌రూపమిదే.. స్వధర్మాన్ని పరిరక్షించగా.. సమస్తాన్ని ప్రక్షాళించగా..సముద్భవించే అవతారమిదే..’ అంటూ సాగిన ఈ పాట వీనులవిందుగా ఉంది.

ప్రధానంగా ఆకట్టుకునే సాహిత్యం మరియు చెవులకు అమృతంలా అనిపించే అద్భుతమైన సంగీతంతో, ఒక దైవికమైన వాతావరణాన్ని సృష్టిస్తూ ఈ పాట కల్కి చిత్రం యొక్క ఇతివృత్తాన్ని మరియు సారాన్ని సంపూర్ణంగా పట్టుకుంది. కాగా అంతకుముందు రోజు ఈ చిత్రంలో మరియమ్ పాత్రలో నటించిన సీనియర్ నటి శోభనా చంద్రకుమార్ శ్రీకృష్ణుని జన్మస్థలంగా గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉన్న పవిత్ర భూమి మధురలో ఈ పాటకు తన బృందంతో కలిసి నృత్యం చేయడం గమనార్హం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.