గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి క్లీన్ హిట్-అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్

gangs of godavari movie breakeven in all areas

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో వచ్చిన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. గోదావరి నేపథ్యంలో రూరల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా తెరకెక్కింది. ఈసినిమా మే 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా మిక్డ్స్ టాక్ ను సొంతం చేసుకుంది. ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమాలో విశ్వక్ మరోసారి తన మాస్ నటనతో ఆకట్టుకున్నాడు. ఈసినిమా కలెక్షన్స్ పరంగా కూడా మంచి కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఈసినిమా ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ లో ఈసినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమా కలెక్షన్స్ కు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ ను అందుకుంది.. మిక్స్డ్ రివ్యూస్ వచ్చినా కూడా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ను అందుకుంది.. మీ అందరి ప్రేమ, సపోర్ట్ కు థ్యాంక్స్ అంటూ చిత్ర నిర్మాణ సంస్థ తమ ట్విట్టర్ ద్వారా తెలియచేశారు.

కాగా ఈసినిమాలో నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా నటించగా.. సాయి కుమార్, గోపరాజు రమణ కీలక పాత్రల్లో కనిపించారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. యువన్ శంకర్ రాజా ఈసినిమాకు సంగీతం అందించాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.