పరుశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా వచ్చిన సినిమా ఫ్యామిలీ స్టార్. గీతా గోవిందం సినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా కావడంతో ఈసినిమాపై మొదటి నుండీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈసినిమా అనుకున్నంత విజయాన్ని అందించలేకపోయింది అని చెప్పొచ్చు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేసిన సంగతి తెలిసిందే కదా. ఏప్రిల్ 26వ తేదీన నుండి ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఇప్పుడు హిందీ వెర్షన్ కు సంబంధించిన అప్ డేట్ వచ్చేసింది. ఫ్యామిలీ స్టార్ హిందీ వెర్షన్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. జియో సినిమాస్ లో ఏప్రిల్ 28వ తేదీ నుండి ఈసినిమా హిందీ వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చేస్తుంది. మరి హిందీ అడియన్స్ కు ఈసినిమా ఏ మేరకు నచ్చుతుందో చూద్దాం.
కాగా ఫ్యామిలీ స్టార్ సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చింది. ఈ సినిమాలో గోవర్ధన్ అనే మిడిల్ క్లాస్ యువకుడిగా విజయ్ దేవరకొండ కనిపించాడు. అతని జీవితంలోకి ఇందు ఎలా వచ్చింది? ఇందును ప్రేమించిన గోవర్ధన్ ఆమెకు ఎందుకు బ్రేకప్ చెప్పాడు? జాబ్ కోసం గోవర్ధన్ అమెరికా వెళ్లగా అతడి వెంట ఇందు ఎందుకు వచ్చింది? చివరికి గోవర్ధన్, ఇందు ఎలా ఒక్కటయ్యారు అనేదే ఈసినిమా కథ.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























