100 కోట్లకు చేరువలో మహారాజ

Vijay Sethupathi’s Maharaja Marching Towards 100 Crore Club with Rs.85.3 Cr Gross

కోలీవుడ్ వెర్సెటైల్ యాక్టర్, మక్కళ్‌ సెల్వన్‌ విజయ్ సేతుపతి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మహారాజ’. విజయ్ సేతుపతి 50వ చిత్రంగా తెరకెక్కిన ఈ మైల్ స్టోన్ సినిమాకు ‘కురంగు బొమ్మై’ ఫేమ్ నితిలన్‌ సామినాథన్‌ దర్శకత్వం వహించారు. ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్‌, సీనియర్ నటీమణులు మమతా మోహన్‌ దాస్‌, అభిరామి, నట్టీ కీలక పాత్రలు పోషించారు. ప్యాషన్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై రూపొందిన ‘మహారాజ’ చిత్రానికి ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్‌ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక విడుదలకు ముందే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన ట్రైలర్‌ సహా ఇతర ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ నేపథ్యంలో జూన్ 14న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైంది. ఇక రిలీజైన తొలిరోజునే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ రివేంజ్ డ్రామాకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఎప్పటిలాగే మక్కళ్‌ సెల్వన్‌ తనదైన నటనతో అదరగొట్టగా.. డిఫరెంట్ స్క్రీన్ ప్లే ఆడియెన్స్‌ను కట్టిపడేస్తోంది. మరోవైపు పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ మూవీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటి కీర్తి సురేశ్, టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని సహా అనేకమంది మహారాజను వీక్షించి నిథిలన్ డైరెక్షన్ మరియు విజయ్ సేతుపతి నటనను ప్రశంసించారు. ఈ నేపథ్యంలో మహారాజ బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపే కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఈ క్రమంలో తమిళనాట రికార్డులు బద్దలు కొడుతోంది. ఈ ఏడాది రిలీజైన తమిళ చిత్రాలలో ఫస్ట్ వీకెండ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన మొదటి సినిమాగా ఇప్పటికే సరికొత్త రికార్డ్ సృష్టించింది.

ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. మహారాజ 11 రోజుల్లో మొత్తం రూ. 85.3 కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించింది. ఇదే ఊపుతో త్వరలోనే రూ. 100 కోట్ల క్లబ్‍లో అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉంది. అయితే గురువారం పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 AD’ దేశవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతోంది. దీంతో మహారాజ రూ. 100 కోట్ల కలెక్షన్స్ సాధిస్తుందా? లేదా? అని సినీ ప్రియులు ఆసక్తిగా గమనిస్తున్నారు. మొత్తానికి విజయ్ సేతుపతి 50వ చిత్రంతో సాలిడ్ హిట్ అయితే అందుకున్నారని చెప్పొచ్చు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.