పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మోస్ట్ ఎవైటెడ్ అప్ కమింగ్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ ‘కల్కి 2898 AD’. టాలీవుడ్ యంగ్ అండ్ విజనరీ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ ఈ సినిమా విజువల్ వండర్‌గా తెరకెక్కించారు. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ భామలు దీపికా పదుకొణే, దిశా పటానీ కథానాయికలుగా నటించగా.. బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్, విశ్వ నటుడు కమల్ హాసన్, బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ, రాజేంద్రప్రసాద్, పశుపతి తదితరులు కీలక పాత్రలు పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దేశంలోనే ఇంతకుముందెన్నడూ లేనివిధంగా అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ మల్టీలింగ్వెల్, మైథాలజీ-ఇన్స్ స్పైర్డ్ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కి గ్రౌండ్ బ్రేకింగ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఇటీవలే రిలీజ్ చేసిన ‘భైరవ ఆంథమ్’ ఇండియన్స్ బిగ్గెస్ట్ సాంగ్ అఫ్ ది ఇయర్‌గా టాప్ చార్ట్‌లో వుంది.
వీటితోపాటుగా ఇటీవలే విడుదల చేసిన రిలీజ్ ట్రైలర్ కూడా మ్యాసీవ్ రెస్పాన్స్‌తో గ్లోబల్ వైడ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇక ఇదిలావుండగా, కల్కి జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది. కల్కి టికెట్ రేట్లను పెంచుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవోను జారీ చేసింది. దీనిప్రకారం.. విడుదలైన రోజు నుంచి 14 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచేందుకు అనుమతిచ్చింది.
ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ ధరలను సింగిల్ స్క్రీన్స్‌లో రూ.75, మల్టీప్లెక్స్‌లో రూ.125 వరకు పెంచుకునే వెసులుబాటు మేకర్స్‌కు లభించింది. దీంతో సింగిల్ స్క్రీన్‌లో రూ.265, అదే మల్టీప్లెక్స్‌లో రూ.413గా టికెట్ రేట్లు ఉండనున్నాయి. ఇక ఈ ధరలతో పాటు అదనంగా టాక్స్‌లు ఉంటాయి. అలాగే రోజుకు 5 షోలు వేసుకునేందుకు అనుమతి ఇస్తూ హోమ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కల్కి అదనపు షోలకు మరియు టికెట్స్ రేట్ల పెంపుకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీంతో కల్కి అడ్వాన్స్ బుకింగ్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయిలో జరిగే అవకాశం కనిపిస్తోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: