సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ. రీసెంట్ గానే భజే వాయు వేగం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా యాక్షన్ ప్లస్ ఎమోషన్ డ్రామాాగా ఈసినిమా వచ్చింది. ఇక ఈసినిమాతో ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న కార్తికేయకు డీసెంట్ హిట్ అయితే దక్కింది. అంతేకాదు కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా మంచి కలెక్షన్సే అందించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ పై రీసెంట్ గా పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఆవార్తలకు క్లారిటీ వచ్చేసింది. తాజాగా ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకోగా మేకర్స్ అధికారింగా ప్రకటించారు. ఈసినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నారు. ఈనేపథ్యంలో జూన్ 28వ తేదీ నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రానున్నట్టు తెలిపారు.
కాగా ఈసినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించగా.. తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ, రాహుల్ టైసన్ కీలక పాత్రల్లో కనిపించారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై నిర్మించిన ఈసినిమాకు రధన్ సంగీతం అందించగా.. ఆర్.డి రాజశేఖర్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: