టాలీవుడ్ సీనియర్ నటి విజయశాంతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు హీరో నందమూరి కళ్యాణ్ రామ్. కాగా ప్రస్తుతం ఆమె కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతోన్న కొత్త చిత్రం (#NKR21)లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు విజయశాంతి జన్మదినం సందర్భంగా.. కళ్యాణ్ రామ్ సోషల్ మీడియా వేదికగా ఆమెకు బర్త్ డే విషెస్ తెలియజేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని విజయశాంతి క్యారెక్టర్‌కు సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేసింది చిత్రబృందం. దీనిని గమనిస్తే, ఇందులో ఆమె పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు అర్ధమవుతోంది. యాక్షన్ ప్యాక్డ్‌గా వచ్చిన ఈ గ్లింప్స్ మూవీ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. లేడీ సూపర్ స్టార్‌గా పేరొందిన విజయశాంతి.. మహేష్ బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరూ’ చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ఇక ఇటీవలే తన తాత, దివంగత నటుడు సీనియర్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా #NKR21 షూటింగ్ ప్రోగ్రెస్‌లో ఉందని వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ‘ది ఫిస్ట్ ఆఫ్ ఫ్లేమ్’ పేరుతో 33 సెకన్ల నిడివిగల ఒక స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. ‘కాంతరా’ ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. విజయశాంతి కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్ మరియు అశోకా క్రియేషన్స్ బ్యానర్లపై సునీల్ బలుసు, అశోక్ వర్ధన్ ముప్పా లతో కలిసి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: