రామ్- పూరి జగన్నాథ్ ల డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ ఫైనల్ కు చేరింది.ఈరోజు అల్యూమినియం ఫ్యాక్టరీ లో చివరి షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది.ఇంకా రెండు పాటలు బ్యాలెన్స్ ఉండగా ఈరోజు నుండి స్పెషల్ సెట్ లో ఓ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు.ఇదే షెడ్యూల్ లో ఇంకో సాంగ్ ను కూడా కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.దాంతో షూటింగ్ కంప్లీట్ కానుంది.జూలై నుండి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుకానున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాకు మంచి రిలీజ్ డేట్ కూడా దొరికేసింది.పుష్ప 2 రిలీజ్ వాయిదా పడడం తో ఆగస్టు 15న డబుల్ ఇస్మార్ట్ రానుంది.ఇప్పటివరకు అయితే ఈ ఒక్క సినిమానే బరిలో నిలిచింది. అయితే అదే డేట్ కు మరి కొన్ని సినిమాలు కూడా విడుదలకానున్నాయని సమాచారం.దాంతో బాక్సాఫీస్ వద్ద పోటీ తప్పకపోవచ్చు.బ్లాక్ బాస్టర్ ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా వస్తున్న డబుల్ ఇస్మార్ట్ పై భారీ అంచనాలు వున్నాయి.ఈసినిమాతో బ్లాక్ బాస్టర్ కొట్టి కం బ్యాక్ ఇవ్వాలని పూరి చూస్తున్నాడు.
ఇందులో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుండగా సంజయ్ దత్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.త్వరలోనే ఈసినిమా నుండి సాంగ్ రిలీజ్ కానుంది.డబుల్ ఇస్మార్ట్ ను పూరి జగన్నాథ్ ,ఛార్మి నిర్మిస్తుండగా పాన్ ఇండియా మూవీ గా విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























