నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా కల్కి 2898 ఏడీ. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ భారీ బడ్జెట్ తో ఈసినిమాను రూపొందిస్తుండగా మరి కొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈసినిమా నుండి రోజుకో అప్ డేట్ ఇస్తూ సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచుతున్నారు. దానికితోడు నాగ్ అశ్విన్ రిలీజ్ చేస్తున్న స్పెషల్ వీడియోస్ కల్కి పై ఆసక్తిని ఇంకా పెంచుతున్నాయి. ముఖ్యంగా కాశీ, కాంప్లెక్స్, శంబాలా అంటూ మూడు ప్రపంచాలను ఈసినిమాలో చూపించనున్న నేపథ్యంలో అవి ఎలా ఉంటాయి.. నాగ్ అశ్విన్ విజువల్ ట్రీట్ ఏ రేంజ్ లో ఇస్తాడా అని వాటిని చూడటానికి ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పటికే ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ట్రైలర్ తో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇప్పుడు తాజాగా మరో ట్రైలర్ తో వచ్చేశారు. ఈ ట్రైలర్ లో యాక్షన్ సీక్వెన్స్ ను ఓ రేంజ్ లో చూపించారు. ఇక విజువల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ విజువల్స్ ను సిల్వర్ స్క్రీన్ పై చూడటానికి అందరూ వెయిట్ చేస్తున్నారు.
కాగా ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే పలు పోస్టర్లు, టీజర్, భైరవ ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. అన్నీ ఆకట్టుకున్నాయి. ఈసినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో మరొక హీరోయిన్ బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటానీ కూడా నటిస్తుంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్, పశుపతి పలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























