పాన్ ఇండియా ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య రాబోతున్న సినిమా కల్కి 2898ఏడీ. ఇక ఈసినిమాను సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడెప్పుడూ చూద్దామా అని యావత్ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ముఖ్యంగా నాగ్ అశ్విన్ ఈసినిమా గురించి చెప్పే విషయాలు మరింత క్యూరియాసిటీని పెంచుతున్నాయి. నాగ్ అశ్విన్ ఈసినిమాను వెండితెరపై ఎలా చూపించనున్నాడు ? అవుట్ పుట్ ఎలా వచ్చింది అనే దానిపైనే అందరిలో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. వరుసగా అప్ డేట్లు ఇస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఒక ట్రైలర్ ను రిలీజ్ చేయగా.. తాజాగా సెకండ్ ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. యాక్షన్ సీక్వెన్స్ తో ఉన్న సెకండ్ ట్రైలర్ కూడా ఆకట్టుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమా నార్త్ అమెరికాలో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూస్తూనే ఉన్నాం. అక్కడ ప్రీ సేల్స్ లో బీభత్సం సృష్టిస్తుంది. రీసెంట్ గానే ప్రీ సేల్స్ లో 2 మిలియన్ మార్క్ ను చేరుకోగా ఇప్పుడు తాజాగా ఆ నెంబర్ మరింత పెరిగింది. అడ్వాన్స్ బుకింగ్స్ లో 2.5 మిలియన్ మార్క్ ను సొంతం చేసుకొని మరో మైల్ స్టోన్ ను అందుకుంది. మరి రిలీజ్ కు మరో ఐదు రోజులు ఉంది.. ఈ ఐదు రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
కాగా ఈసినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో మరొక హీరోయిన్ బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటానీ కూడా నటిస్తుంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్, పశుపతి,శోభన, మాళవిక పలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























