టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ‘క్రాక్’, ‘వీరసింహారెడ్డి’ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద వరుస సక్సెస్‌లు అందుకున్నాడు. ఈ క్రమంలో తాజాగా మరో సర్‌ప్రైజింగ్ అనౌన్స్‌మెంట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే ఈసారి ఆయన ఏకంగా ఓ బాలీవుడ్ స్టార్ హీరోతో సినిమా చేయదానికి సిద్దమయ్యాడు. కాగా ఇటీవలి కాలంలో మన దర్శకులు ఇతర భాషల హీరోలతో సినిమాలు చేస్తుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గోపీచంద్ మలినేని కూడా ఒక స్టార్ హీరోతో క్రేజీ ప్రాజెక్టును తెరకెక్కించనున్నాడు. ఈరోజు హైదరాబాద్‌లో కోర్ టీమ్ మరియు ప్రత్యేక అతిథులతో సినిమా లాంఛనంగా ప్రారంభమైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక వివరాల్లోకి వెళ్తే.. గదర్ 2తో గతేడాది బాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సన్నీ డియోల్ కథానాయకుడిగా గోపీచంద్ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్‌లు మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తుండటం విశేషం. ప్రస్తుతానికి వర్కింగ్ టైటిల్ ఎస్‌డీజీఎం (#SDGM)గా వ్యవహరిస్తున్న ఈ మూవీ షూటింగ్ జూన్ 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ మేరకు గురువారం మేకర్స్ సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు.
కాగా ఈ చిత్రంలో సన్నీ సరసన సయామీ ఖేర్, రెజీనా కసాండ్రా ఈ చిత్రంలో కథానాయికలుగా నటించనున్నారు. ఇక నాలుగు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ కెరీర్‌లో 100 చిత్రాల దిశగా దూసుకుపోతున్న సన్నీడియోల్ బాలీవుడ్‌లో యాంగ్రీ యాక్షన్ హీరోగా ప్రసిద్ధి చెందాడు. ఈ సినిమాకు టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ సంగీతం అందిస్తుస్తుండగా.. రిషి పంజాబి సినిటోగ్రఫర్‌గా, అవినాష్ కొల్ల ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు మేకర్స్.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: