టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. కృష్ణచైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విశ్వక్ సరసన నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రానికి వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నుమూరి సహ నిర్మాతలు. గోదావరి నేపథ్యంలో తెరకెక్కిన ఈ రూరల్ యాక్షన్ ఎంటర్టైనర్కి కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ కంపోజర్ యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఇక ఈ సినిమాకి సంబంధించి రిలీజైన టీజర్, ట్రైలర్ సహా ప్రచార చిత్రాలు అన్నీ బాగా ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మే 31న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. బాక్సాఫిస్ వద్ద టాక్ తో సంబంధం లేకుండా అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. అయితే అనూహ్యంగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. థియేట్రికల్ రన్ అనంతరం ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. కాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుంది. ఈ క్రమంలోనే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటన వచ్చింది.
Manushulu moodu rakhalu, naashi rakham, rendodhi boshi rakham, moododhi nanyamaina rakham. Ee mooditini dhaati charithalo migilipovadaniki Lankala Ratnam osthunnadu.#GangsofGodavari coming to Netflix on 14 June in Telugu, Tamil, Malayalam, and Kannada! pic.twitter.com/K4gqmj6Xb4
— Netflix India South (@Netflix_INSouth) June 9, 2024
ఈ మేరకు సదరు ప్లాట్‌ఫామ్ సోషల్ మీడియా వేదికగా స్ట్రీమింగ్ డేట్‌ను కూడా ప్రకటించింది. జూన్ 14న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది. ఇక ఈ సందర్భంగా ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టింది నెట్‌ఫ్లిక్స్. అందులో.. “మనుషులు మూడు రకాలు, నాశి రకం, రెండోది బోషి రకం, మూడోది నాణ్యమైన రకం. ఈ మూడిటిని దాటి చరిత్రలో మిగిలిపోవడానికి లంకల రత్నం వస్తున్నాడు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో జూన్ 14న నెట్‌ఫ్లిక్స్‌లోకి వస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి!” అని పేర్కొంది. సో.. మూవీ లవర్స్ గెట్ రెడీ. థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్ అయినవారు ఎంచక్కా ఇంట్లోనే కూర్చుని చూసేయండి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























