స్వాగ్ లో మరో బ్యూటీ- దక్షా ఫస్ట్ లుక్ రిలీజ్

daksha nagarkar first look out from swag movie

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఎప్పుడూ కాస్త డిఫరెంట్ సినిమాలు ఎంచుకునే శ్రీవిష్ణు కు ఆ మధ్య పరాజయాలే ఎక్కువగా పలకరించాయి. అయితే గత ఏడాది సామజవరగమన, ఈ ఏడాది ఓ భీమ్ బుష్ సినిమాలతో విజయాలను అందుకొని మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉండగా అందులో స్వాగ్ సినిమా ఒకటి. హసిత్ గోలి దర్శకత్వంలో ఈసినిమా రానుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమాలో నటిస్తున్న పాత్రలకు సంబంధించి పోస్టర్లను రిలీజ్ చేసుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఈసినిమాలో నటిస్తున్న రీతూవర్మ, మీరా జాస్మిన్ కు సంబంధించిన పోస్టర్లను రిలీజ్ చేశారు. వింజామర వంశపు రాణి రుక్మిణి దేవిగా రీతూవర్మ, యువరాణి ఉత్పల దేవిగా మీరా జాస్మిన్ కనిపించనున్నారు. ఇక ఈసినిమాలో మరో బ్యూటీ కూడా భాగమైంది. ఆ బ్యూటీ ఎవరో కాదు దక్షా నగార్కర్. స్వాగ్‌ ప్రపంచానికి మరింత రాజసం అంటూ తాజాగా ఆమె లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. యువరాణిలా ఉన్న దక్షా లుక్ ఆకర్షణీయంగా ఉంది.

కాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా.. వేద రామన్ శంకరన్ సినిమాటోగ్రఫర్ గా వ్యవహరిస్తున్నారు. జూలై ఫస్ట్ వీక్ లో ఈసినిమాను రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.