తమిళ్ రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమాలు కంగువ, తంగలాన్ సినిమాలు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వీటిలో తంగలాన్ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ ఇంతవరకూ రిలీజ్ కు నోచుకోలేదు. మరోవైపు కంగువ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈనేపథ్యంలోనే ఈరెండు సినిమాల రిలీజ్ లపై సోషల్ మీడియాలో పలు ట్రోల్స్ నడుస్తున్నాయి. దీంతో తాజాగా ఈ ట్రోల్స్ పై నిర్మాత ధనుంజయ్ స్పందిస్తూ స్ట్రాంగ్ రిప్లై అయితే ఇచ్చారు. ఈ మధ్య కంగువ, తంగలాన్ రిలీజ్ డేట్లపై పలు ట్రోల్స్, పోస్టులు చూస్తున్నాను.. మీ ఉత్సుకతను నేను అర్థం చేసుకోగలను కానీ ఒక ప్రొడ్యూసర్ గా నేను వందల కోట్లు పెట్టి సినిమాలను నిర్మించా.. సినిమాలను ఎప్పుడు రిలీజ్ చేయాలో నాకు తెలుసు.. ఓ సినిమా రిలీజ్ చేయాలి అంటే ఎకనామిక్ గా కొన్ని అంచనాలు ఉంటాయి అవన్నీ దృష్టిలో పెట్టుకొని రిలీజ్ డేట్ లని అనౌన్స్ చేస్తాము. అందుకే మాకు సలహాలు ఇవ్వడం, ట్రోల్స్ చేయడం, కామెంట్స్ చేయడం ఆపండి. మాకు సపోర్ట్ చేయండి.. రిలీజ్ డేట్ ప్రకటించేవరకూ కాస్త చిల్ అవ్వండి అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.
I see a lot of posts & trolls regularly on the release date announcement of #Kanguva & #Thangalaan tagging me. Guys, chill. We understand your enthusiasm but a Producer, who invested hundreds of crores knows when to release his films, to maximise revenues & minimise the risk.…
— G Dhananjeyan (@Dhananjayang) June 9, 2024
కాగా విక్రమ్ హీరోగా వస్తున్న తంగలాన్ సినిమా పా రంజిత్ దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ సినిమాగా కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లోని గనుల్లో పనిచేసే కార్మికుల జీవితం ఆధారంగా ఈసినిమా రాబోతుంది. ఈసినిమాలో పార్వతి తిరువొత్తు, డేనియల్ కాల్టాగిరోన్, మాళవిక మోహనన్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు.
స్టార్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో సూర్య హీరోగా వస్తున్న సినిమా కంగువ. ఈసినిమా హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో.. 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా వస్తుంది. ఈసినిమాలో సూర్య సరసన దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాని స్టూడియో గ్రీన్ తో పాటు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ సంస్థ యు.వీ క్రియేషన్స్ కూడా కలిసి నిర్మిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: