శర్వానంద్ మనమే రివ్యూ-క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్

sharwanand manamey movie telugu review

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా వస్తున్న సినిమా మనమే. ఎమోషనల్ ప్లస్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈసినిమా మంచి బజ్ నే క్రియేట్ చేసుకుంది. టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ సినిమాకు మంచి హైప్ ను తెచ్చిపెట్టాయి. ఇక ఈసినిమా ఎన్నో అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎలా ఉంది.. ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంది.. శర్వాకు హిట్ ను అందించిందా లేదా అన్నది తెలియాలంటే రివ్యూ చూడాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు.. శర్వానంద్, కృతిశెట్టి, విక్రమ్ ఆదిత్య, సీరత్ కపూర్, అయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుదర్శన్ తదితరులు
దర్శకత్వం.. శ్రీరామ్ ఆదిత్య
బ్యానర్స్.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
నిర్మాతలు.. టీజీ విశ్వప్రసాద్
సంగీతం.. హేషమ్ అబ్దుల్ వాహబ్
సినిమాటోగ్రఫి.. విష్ణు శర్మ, జ్ఞాన శేఖర్ వీఎస్

కథ..
విక్రమ్ (శర్వానంద్) ఎలాంటి గోల్స్ లేకుండా లైఫ్ ను లీడ్ చేస్తుంటాడు. మరోవైపు సుభద్ర (కృతిశెట్టి) అన్నీ పర్ఫెక్ట్ గా ప్లానింగ్ ఉండే అమ్మాయి. ఈక్రమంలో వీరిద్దరూ కలిసి ఖుషిని (విక్రమ్ ఆదిత్య) పెంచాల్సి వస్తుంది. మరి ఆ బాబు ఎవరు..?ఎటువంటి బాధ్యత లేకుండా తిరిగే విక్రమ్.. అన్నింటినీ పర్‌ఫెక్ట్ ప్లానింగ్ ప్రకారం చేసే సుభద్ర కలిసి పిల్లాడిని ఎలా పెంచారు? పిల్లాడిని పెంచే క్రమంలో విక్రమ్ లో ఎలాంటి మార్పులు వస్తాయి..? చివరికి సుభద్ర, విక్రమ్ రిలేషన్ ఏమవుతుంది? అన్నదే మిగిలిన కథ.

విశ్లేషణ
శ్రీరామ్ ఆదిత్య ఒక డిఫరెంట్ పాయింట్ తో వచ్చాడు. బిడ్డల కోసం తల్లిదండ్రులు పడే ఆరాటం అనే కాన్సెప్ట్‌ను దర్శకుడు తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. పిల్లలు చదువుల కోసమో, ఉద్యోగం కోసమో తల్లిదండ్రులకు దూరంగా ఉంటారు.. ఆ టైంలో పిల్లల కోసం పేరెంట్స్ పడే బాధను చూపించే ప్రయత్నం చేశాడు. ఎమోషనల్ కంటెంట్ తో పాటు కామెడీ ని కూడా జోడించి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దడంలో సక్సెస్ అయ్యాడు.

ఫస్ట్ హాఫ్ అంతా శర్వానంద్ అల్లరి, కామెడీ, శర్వా-కృతిశెట్టిల మధ్య సన్నివేశాలతో సాగిపోతుంది. హీరోకి హీరోయిన్ మీద ప్రేమ కలిగే సీన్‌తో ఇంటర్వెల్ బ్లాక్‌ ను చూపిస్తాడు. సెకండాఫ్ కూడా సరదాగానే నడుస్తుంది. అయితే పలు ఎమోషనల్ సీన్స్ కనెక్ట్ అవుతాయి. ప్రీ క్లైమాక్స్‌లో తల్లీకొడుకుల మధ్య వచ్చే సీన్ మరింత హత్తుకుంటుంది.

పెర్ఫామెన్స్
శర్వానంద్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్రలో అయినా నటించే సత్తా ఉన్న నటుడు. తన కెరీర్ లో చాలా వరకూ కాస్త సీరియస్ పాత్రలు, ఎమోషనల్ ఎంటర్ టైన్ మెంట్ లనే చేశాడు. ఇక చాలా రోజుల తరువాత ఈసినిమాలో శర్వా ఎనర్జిటిక్ రోల్ తో వచ్చాడు. విక్రమ్ పాత్రలో శర్వా నటన ఈసినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. కృతిశెట్టి పెర్ఫామెన్స్ కూడా మరో హైలెట్ గా ఉంది. నిజానికి శర్వా-కృతిశెట్టి ల కాంబినేషన్ ఈసినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. శర్వానంద్ కృతి శెట్టి తమదైన స్టైల్ లో కథను ముందుకు తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. చిన్న బాబుకి తల్లిదండ్రులుగా బాగా చేశారు. ఇక వీరితో పాటు శ్రీరామ్ ఆదిత్య తనయుడు విక్రమ్ ఆదిత్య కూడా చాలా క్యూట్ గా ఉండటమే కాకుండా క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకున్నాడు. ఇక మిగిలిన నటీనటులు తమ పాత్రల మేర బాగానే నటించారు.

టెక్నికల్ వాల్యూస్
ఈసినిమాకు టెక్నికల్ వాల్యూస్ కూడా ప్లస్ పాయింట్ అయ్యాయి. హేషమ్ అబ్దుల్ వాహబ్ అందించిన మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రఫి. విజువల్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి. యూకే లోని అందమైన లొకేషన్స్ ను చాలా బాగా చూపించారు. ప్రతి ఫేమ్ ఫ్రెష్ గా కనిపిస్తుంది. నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి.

శర్వానంద్ మూవీస్ అంటే ఫ్యామిలీ అందరూ కలిసి చూడొచ్చు అన్న పేరుంది. అలానే ఈసినిమా కూడా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అంటే అన్ని వర్గాల వారు చూసి ఎంజాయ్ చేసే సినిమా ఇది అని చెప్పొచ్చు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.