టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో శర్వానంద్ తన ల్యాండ్‌మార్క్ 35వ మూవీ ‘మనమే’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై రామ్సే స్టూడియోస్ ప్రొడక్షన్లో నిర్మాత టిజి విశ్వప్రసాద్ అత్యంత గ్రాండ్‌గా నిర్మించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్గా నటించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్‌తో హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో ‘మనమే’ నేడు (శుక్రవారం,జూన్ 7) థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలయింది. ఈ క్రమంలో మేకర్స్ అంతకుముందు ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ శర్వానంద్‌కు ‘ఛార్మింగ్ స్టార్’ టైటిల్ ఇచ్చారు. ఈ మేరకు రూపొందించిన స్పెషల్ వీడియోను ఈవెంట్లో ప్రజెంట్ చేశారు. గ్రాండ్‌గా జరిగిన ఈ వేడుకలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ మారుతి, శివ నిర్వాణ, సాయి రాజేష్, కిషోర్ తిరుమల అతిధులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూ.. మనమే చాలా రోజుల తర్వాత పాజిటివ్ వైబ్రెంట్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ గా వస్తోంది. ట్రైలర్ చాలా నచ్చింది. వైబ్రెంట్, పాజిటివ్‌గా వుందని శ్రీరాం తో చెప్పాను. మ్యూజిక్ విజువల్స్ చూస్తుంటే రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్స్ ప్రేమతో నిండిపోతాయని అనిపిస్తోంది. శ్రీరామ్ చాలా హార్డ్ వర్క్ చేశారు. శర్వా గారు ‘రన్ రాజా రన్’ తర్వాత లాంటి ఫుల్ ఫ్లేడ్జ్ ఎంటర్టైన్మెంట్తో వస్తున్నారు. రెండుగంటల మంచి ఎంటర్ టైన్మెంట్ ఇస్తారని నమ్ముతున్నాను. హేశం అద్భుతమైన మ్యూజిక్ చేశాడు. సినిమా అదిరిపోయిందని క్లోజ్ ఫ్రండ్స్ చెప్పారు. అందరూ థియేటర్స్ లో మనమే ని ఎంజాయ్ చేయండి” అని అన్నారు.
ఇక మరో డైరెక్టర్ డైరెక్టర్ కిషోర్ తిరుమల మాట్లాడుతూ.. “మనమే ప్రమోషనల్ కంటెంట్ చాలా బావుంది. ప్రామెసింగ్ గా వుంది. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. చాలా రోజుల తర్వాత మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ వస్తుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్” అని తెలిపారు.
అలాగే ‘బేబీ’ ఫేమ్ సాయి రాజేష్ మాట్లాడుతూ.. “శ్రీరామ్ ఆదిత్య అంటే నాకు చాలా ఇష్టం. క్రాఫ్ట్ మీద మంచి పట్టువున్న డైరెక్టర్ తను. మంచి హ్యూమన్ బీయింగ్. మ్యూజిక్ విన్నాను అద్భుతంగా వుంది. శర్వా గారు అమెజింగ్ గా వున్నారు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్” అని చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























