సుమన్ చిక్కాల దర్శకత్వంలో టాలీవుడ్ చందమామ కాజల్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా సత్యభామ. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాలో కాజల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుంది. మరికొద్ది గంటల్లోనే ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రీమియర్ షో కూడా నిర్వహించారు. ప్రీమియర్ షో కు మంచి రెస్పాన్సే వచ్చింది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను అయితే ఆపట్లేదు చిత్రయూనిట్. ఇప్పటికే ఈసినిమా నుండి పలు టీజర్, ట్రైలర్ తో పాటు పలు పాటలను కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా మరో పాటను రిలీజ్ చేశారు మేకర్స్. రేజ్ ఆఫ్ సత్యభామ అంటూ పవర్ ఫుల్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. రమేష్ యద్మ లిరిక్స్ అందించిన ఈపాటకు.. సౌజన్య భగవతుల, రవి ప్రకాష్ ఆలపించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
#TheRageOfSatyabhama lyrical from #Satyabhama out now💥
▶️ https://t.co/qVGybYgQZHWatch #Satyabhama in action on the big screens from tomorrow ❤️🔥
Book your tickets now!
🎟️ https://t.co/RKSGzgTcW6✍️ #RameshYadma
🎙️ @soujanya.singer @Raviprakashchodimalla#SatyabhamaOnJune7th— Kajal Aggarwal (@MsKajalAggarwal) June 6, 2024
కాగా ఈసినిమాలో ఇంకా నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్ధన్, రవివర్మ, అంకిత్ కొయ్య, సంపద ఎన్, ప్రజ్వల్ యద్మ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ‘గూఢచారి’ ఫేమ్ శశికిరణ్ తిక్కా స్క్రీన్‌ప్లేతో పాటు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: