వాట్ ద ఫిష్ నుండి కొత్త పోస్టర్లు రిలీజ్

new posters released from manoj What The Fish Movie

మంచు మనోజ్ నుండి సినిమా వచ్చి చాలా కాలమే అయి పోయింది. అయితే చాలా రోజుల తరువాత మరో కొత్త సినిమాతో రాబోతున్నాడు. వరుణ్ కోరుకొండ దర్శకత్వంలో మనోజ్ హీరోగా వస్తున్న సినిమా వాట్ ద ఫిష్. ఈసినిమా సెట్స్ పైకి వెళ్లి చాలా కాలమే అవుతుంది. ప్రస్తుతం అయితే షూటింగ్ దశలో ఉంది. ఆమధ్య పలు పోస్టర్లు అలానే గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే గత కొద్దికాలంగా ఈసినిమా నుండి ఎలాంటి అప్ డేట్స్ లేవు. చాలా రోజుల తరువాత తాజాగా ఈసినిమా నుండి కొత్త పోస్టర్లను రిలీజ్ చేశారు మేకర్స్. ఈసినిమాలో నటిస్తున్న ఇతర పాత్రలకు సంబంధించిన పోస్టర్లను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో అదితీ కర్నావత్‌, సుస్మిత ఛటర్జీ, హరినాథ్‌ పొలిచెర్ల, సత్య కీలక పాత్రల్లో నటిస్తున్నట్టు తెలియచేస్తూ పోస్టర్లను కూడా రిలీజ్ చేశారు. పోస్టర్లు అయితే ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాయి.

కాగా ఈసినిమాలో మెగా ప్రిన్సెస్ నిహారిక కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుంది. నిహారిక ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా ఇప్పటికే రిలీజ్ చేశారు. ఈసినిమాలో ఆమె పాత్ర అష్టలక్ష్మి అకా ఏయస్ హెచ్ నటిస్తుంది.
ఈసినిమాను 6ix సినిమాస్ ఇంకా afilmbyv బ్యానర్స్ పై విశాల్ బెజవాడ, సూర్య బెజవాడ నిర్మిస్తున్నారు. శక్తికాంత్ కార్తీక్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.