సుబ్బు మంగదేవి దర్శకత్వంలో నరేష్ హీరోగా వస్తున్న సినిమా బచ్చలమల్లి. 1990 బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ డ్రామా పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక రీసెంట్ గానే అల్లరి నరేష్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. రఫ్ అండ్ రగ్డ్ లుక్ లో ఉన్న అల్లరి నరేష్ ఫస్ట్ లుక్ అయితే మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ట్రాక్టర్ డ్రైవర్ గా మల్లి అనే పాత్రలో అల్లరి నరేష్ నటిస్తున్నాడు. ఫస్ట్ లుక్ తోనే సినిమాపై క్యూరియాసిటీని పెంచేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈసినిమా యూఎస్ఏ రిలీజ్ కు సంబంధించిన అప్ డేట్ వచ్చింది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ అయిన ప్రత్యంగిర మూవీస్ వారు బచ్చలమల్లి సినిమా యూఎస్ఏ రిలీజ్ హక్కులను సొంతం చేసుకున్నారు. అక్కడ గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఇంకా షూటింగ్ దశలో ఉండగానే యూఎస్ రిలీజ్ డీల్ క్లోజ్ అవ్వడం గొప్ప విషయమే అంటున్నారు.
కాగా ఈసినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. రావు రమేష్, హరితేజ, ప్రవీణ్ పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మించనున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా.. మానాడు, రంగం, మట్టి కుస్తీ చిత్రాలకు పనిచేసిన రిచర్డ్ ఎం నాథన్ కెమరామెన్ గా పని చేస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్. దర్శకుడు సుబ్బు స్వయంగా కథ, స్క్రీన్ ప్లే అందిస్తుండగా, విప్పర్తి మధు స్క్రీన్ ప్లే రైటర్ గా పని చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























