యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ మరియు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం ‘భారతీయుడు 2’. కాజల్ అగర్వాల్ హీరోయిన్‍గా నటిస్తుండగా.. సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్ సింగ్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవల్లో రిలీజ్ కానుంది. ఈ మూవీ పాటలు సోనీ మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదలవుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ‘భారతీయుడు 2’ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హక్కులను శ్రీలక్ష్మి మూవీస్ సంస్థలు దక్కించుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం చెన్నైలో సినీ ప్రముఖులు సమక్షంలో ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు హీరో శింబు, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్, నెల్సన్, నిర్మాత ఏ ఎం రత్నం, ఏసియన్ సినిమాస్ సునీల్ నారంగ్, భరత్ నారంగ్ వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో శృతి హాసన్, మౌనీ రాయ్, శంకర్ కూతరు అదితీ శంకర్, కొడుకు అర్జిత్ శంకర్ లైవ్ పర్ఫామెన్స్‌లు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఇక ఈ ఈవెంట్‌లో పాల్గొన్న దర్శకుడు శంకర్ చిత్ర విశేషాలను పంచుకున్నారు. శంకర్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ‘ఈ రోజే ఫైనల్ మిక్సింగ్ విన్నాను. అనిరుధ్ మ్యాజిక్ చేశాడు. సరికొత్త ఎనర్జీ వచ్చింది. ఆడియెన్స్‌కి కూడా సినిమా చూశాక అదే ఎనర్జీ వస్తుంది. ఇండియన్ టైంలోనే కమల్ హాసన్ గారు సీక్వెల్ తీద్దామని అన్నారు. కానీ అప్పుడు నా వద్ద సరైన కథ లేదు. చాలా ఏళ్లకు పేపర్స్‌లో లంచం వల్ల జరిగే ఘోరాలు, అన్యాయాలు చూసి కథ ఇలా రాద్దామా? అలా రాద్దామా? అని అనుకున్నాను. కానీ అప్పుడు నేను, కమల్ హాసన్ గారు వేర్వేరు ప్రాజెక్టుల్లో ఉండటంతో కుదర్లేదు.”
“రోబో 2.ఓ తరువాత ఈ కథ రాసుకున్నాను. అలా ఇండియన్ 2 మొదలైంది. మొదటి రోజు షూటింగ్‌లో ఇండియన్ 2 గెటప్‌లో కమల్ హాసన్ను చూసి అంతా షాక్ అయ్యాం. 28 ఏళ్ల క్రితం ఎలా అనిపించిందో.. అప్పుడు కూడా అలాంటి ఫీలింగ్ కలిగింది. ఇండియన్ తాత మంచి వాళ్లకు మంచివాడు.. చెడ్డవాళ్లకు చెడ్డవాడు. ఇలాంటి పాత్రను చేయడం మామూలు విషయం కాదు. ఆయన 360 డిగ్రీ కంటే ఒక డిగ్రీ ఎక్కువగా నటించే సత్తా ఉన్న నటుడు. 70 రోజుల పాటు మేకప్‌తో నటించారు. ఆయనలాంటి యాక్టర్ ఈ ప్రపంచంలోనే లేరు. ఆయనతో ఇండియన్ 2, ఇండియన్ 3 చేయడం ఆనందంగా ఉంది. ”
“ఎస్ జే సూర్య డిఫరెంట్ రోల్ చేశారు. సముద్రఖని, సిద్దార్థ్, బాబీ సింహా చక్కటి పాత్రలు పోషించారు. మనోబాలా, వివేక్ గారు మన మధ్య లేరు. కానీ వాళ్ల పాత్రలు మనతో గుర్తుండిపోతాయి. కాజల్, రకుల్ అద్భుతంగా నటించారు. ఇండియన్ 2 వేరే నిర్మాతతో సినిమా చేయాలి. కానీ లైకా నుంచి సుభాస్కరన్ గారు ఫోన్ చేసి ‘నేను నిర్మిస్తాను.. నాకు ఇండియన్ సినిమా అంటే చాలా ఇష్టం. నేనే నిర్మిస్తాను’ అని అన్నారు. మాకు ఈ చిత్ర నిర్మాణ సమయంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. అయినా ఎంతో సపోర్ట్‌గా నిలిచారు. మాకు అండగా నిలిచిన సుభాస్కరన్ గారికి థాంక్స్. ముత్తు రాజ్ గారి ఆర్ట్ వర్క్ అద్భుతంగా ఉంటుంది. ఇండియన్ ఎంత పెద్ద హిట్ అయిందో ఇండియన్ 2 అంత కంటే పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను’ అని అన్నారు దర్శకుడు శంకర్.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























