భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వస్తున్న సినిమా స్వయంభూ. సోసియో ఫాంటసీ చిత్రంగా నిఖిల్ కెరీర్ లోనే భారీ స్థాయిలో ఈసినిమా వస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, మేకింగ్ వీడియోస్ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ గురించి ఒక క్రేజీ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాలో భారీ ఎపిక్ వార్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నట్టు.. ఈ ఒక్క ఎపిసోడ్ కే 8కోట్ల బడ్జెట్ ను పెట్టినట్టు తెలిపారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా నేడు నిఖిల్ పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే కదా. ఈసందర్బంగా తాజాగా ఈసినిమా నుండి అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. నిఖిల్ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. రెండు చేతుల్లో రెండు కత్తులు పట్టుకొని ఉన్న నిఖిల్ పవర్ ఫుల్ పోస్టర్ అయితే ఆకట్టుకుంటుంది.
Thanks for the Birthday Wishes team #Swayambhu 🔥❤️
Every day on shoot is an exhilarating Exciting Experience.. can’t wait to show you all what we r Making 😇 @iamsamyuktha_ @NabhaNatesh @krishbharat20 @RaviBasrur @DOPSenthilKumar @TagoreMadhu @bhuvan_sagar @PixelStudiosoff… pic.twitter.com/ilKhmOE8VJ— Nikhil Siddhartha (@actor_Nikhil) June 1, 2024
కాగా ఈసినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. నభ నటేష్ కూడా మరో కీలక పాత్రలో చేయనుంది. ఈసినిమాకు మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫి అందిస్తుండగా. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్‌పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. ఎం.ప్రభాహరన్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి వాసుదేవ్ మునెప్పగరి డైలాగ్స్ అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























